తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TS TET 2022) ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఈ ఫలితాలను విడుదల చేశారు. జూన్ 12న నిర్వహించిన టెట్ పరీక్షలో పేపర్-1కు 3,18,506, పేపర్- 2 కు 2,51,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. https://tstet.cgg.gov.in/ ఈ సైట్ ద్వారా ఈ ఫలితాలను చూసుకోవచ్చు. కాగా టెట్ పరీక్షకు సంబంధించి ఈనెల 15న ప్రైమరీ కీ విడుదల కాగా.. జూన్ 29న టెట్ ఫైనల్ కీ ని అధికారులు రిలీజ్ చేశారు.
అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన దగ్గరనుంచి ఇప్పటివరకు మూడు సార్లు టెట్ ని నిర్వహించారు. అయితే గతంతో పోలిస్తే ఈసారి ప్రశ్నల సరళి సులువుగా ఉందని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ సారి అధిక సంఖ్యలో టెట్ పరీక్షలో అర్హత సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.