కోడాలి నాని మనిషి కాదు మృగం… బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

-

మంత్రి కోడాలి నానిపై మరోసారి ఫైర్ అయ్యారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. కోడాలి నాని మనిషి కాదు.. మృగం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మొరిగితే మేం గర్జిస్తున్నాం అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. కోడాని నాని విమర్శిస్తేనే మేం ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందన్నారు. పోలీసులపై గౌరవంతో మేం వెళ్లాం అని అన్నారు. కోడాలి నాని చరిత్ర మొత్తం కూడా గుడివాడకు తెలుసు అన్నారు. కొడాలికి మందు, డబ్బు, పదవి పిచ్చి పట్టిందని దుయ్యబట్టారు. కోడాలికి ఆయన భాషలోనే చెబితేనే అర్థం అవుతుందని బుద్ధా వెంకన్న అన్నారు. పథకం ప్రకారం చంద్రబాబు నాయుడిని తిడితే… జగన్ మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నాడని అన్నారు. కోడాలి నాని ఆయిల్ దొంగ అని విమర్శించారు. చంద్రబాబును విమర్శించే స్థాయి నీది కాదని.. చంద్రబాబు అంటే ఓ బ్రాండ్ అని బుద్ధా వెంకన్న అన్నారు. జగన్ చూస్తూ ఊరుకుంటున్నారని… ఆయనను వెంటనే మంత్రి వర్గం నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. వర్ల రామయ్య వంటి దళితుడిని పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని విమర్శించారు. గుడివాడ ఏమైనా పాకిస్తానా..? అని ప్రశ్నించారు. పోలీసులు కొడాలి నాని దగ్గర ఏమైనా పనిచేస్తున్నారా.. అని ప్రశ్నించారు. గుడివాడకు ఎవరూ వెళ్లకూడదా అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news