ఓరేయ్ పిచ్చి కుక్క…కొడాలి నాని బాబు ఎవరు..? : బుద్దా వెంకన్న

-

ఓరేయ్ పిచ్చి కుక్క…కొడాలి నాని బాబు ఎవరు..? అంటూ బుద్దా వెంకన్న నిప్పులు చెరిగారు. మంత్రి కొడాలి నానిది దొంగ తనాల చేసే బతుకు అని… కొడాలి నానికి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని ఆగ్రహించారు. కొడాలి నానికి పాన్ పరాగ్ డబ్బా కొనుక్కునే డబ్బులు కూడా లేవు… అలాంటి కొడాలి నానికి అంత డబ్బు ఎక్కడిది..?పెద్ద కన్వెన్షన్ సెంటర్ కొడాలి నాని ఎలా కట్టగలిగారు..? అని ప్రశ్నించారు.

budda venkanna
budda venkanna

మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు చేస్తే అఫిడవిట్ ఇవ్వలేదని.. గుడివాడమేన్నా పాకిస్తానా..? ఎవ్వరూ గుడివాడ వెళ్లకూడదా..? అని నిలదీశారు. మొన్న టీడీపీ వాళ్లు వెళ్తే ఆపారు.. ఇప్పుడు బీజేపీని అడ్డుకుంటున్నారని.. పోలీసులు ప్రజల దగ్గర జీతాలు తీసుకుంటున్నారా..? కొడాలి నాని దగ్గర జీతాలు తీసుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ మీద విమర్శలు చేస్తే గట్టిగా మాట్లాడితే మేమూ మాట్లాడతామని.. కొడాలి నాని బాబు ఎవరు..? అని నిలదీశారు. మంత్రి కొడాలి చేసే కామెంట్లను వాళ్ల ఇంట్లో వాళ్లు కూడా అసహ్యించుకుంటారని.. 1991లో నెలకు రూ.1.15లక్షల అద్దె కట్టి నేను కొబ్బరికాయల వ్యాపారం చేశానని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news