కేంద్ర ప్రభుత్వం వరుసగా ధరలు పెంచుకుంటూ పోతుండడంతో సామాన్యుడిపై పెను భారం పడుతోంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.198 తగ్గించింది. దీంతో ఢిల్లీలో రూ.2219 నుంచి రూ.2021కి పడిపోయింది. తాజా తగ్గింపుతో హైదరాబాద్‌లో రూ.2426గా ఉన్న సిలిండర్ ధర రూ.2243కు చేరింది. అంటే రూ.183.50 తగ్గింది.
ఇక కోల్‌కతాలో రూ.182, ముంబైలో 190.5, ముంబైలో రూ.187 మేర తగ్గాయి. కాగా, గత నెల 1న కమర్షియల్ సిలిండర్‌పై రూ.135 తగ్గిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల వరసగా సిలిండర్ ధరలు పెంచుతూ వచ్చిన కేంద్రం ప్రభుత్వం… సిలిండర్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తమవుతోంది. అయితే.. ఇంటి సిలిండర్‌పై సబ్సీడీని కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిలిపివేసింది.