Bussiness idea: మహిళలు లక్షలు సంపాదించే ఐడియా..ఓ లుక్ వేసుకోండి..

-

మంచి బిజినెస్ చెయ్యాలని, అందరిలో గొప్పగా ఉండాలని మహిళలు కోరుకుంటున్నారు.. అంతేకాదు అందుకు తగ్గట్లుగానే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.. కొండరైతే ఏకంగా దేశాన్ని శాసించే స్థాయిలో ఉన్నారు..అయితే, మీరు కూడా మంచి బిజినెస్ చెయ్యాలని కలలు కంటున్నారు.. మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా..మీకు వంట చేయడంపై ఆసక్తి ఉంటే కెచప్ మరియు సాస్ తయారీ వ్యాపారం మీకు ఉత్తమమైనది..

 

అందుకే టమాటో కెచప్ మరియు సాస్ తయారీ వ్యాపారాన్ని ఇంటి నుండి ప్రారంభించి మంచి లాభాలు అందుకోవచ్చు. పిల్లల, పెద్దల వరకు ప్రతి ఒక్కరూ టమోటా కెచప్, సాస్‌ను ఇష్టపడతారు.ఈ నేపథ్యంలో రెస్టారెంట్లు, ఫుడ్ స్టాల్స్, క్యాంటీన్లు, హోటళ్లు లేదా ఇళ్లలో కెచప్ లు మరియు సాస్‌లకు డిమాండ్ అధికంగా ఉంటుంది.. యూట్యూబ్ లో అనేక వీడియోలు ఉన్నాయి.. వాటిని చూసి మీరు సాస్ లను తయారు చెయ్యొచ్చు..

అయితే,మీరు తప్పనిసరిగా MSME పరిశ్రమ విభాగంలో వ్యాపారాన్ని నమోదు చేసుకోవాలి. మీరు ఆన్‌లైన్‌లో లైసెన్స్ పొందవచ్చు. ఇది మీరు నమోదు చేసిన 10-15 రోజులలోపు పొందుతారు.మార్కెట్ లో మంచి డిమాండ్ ఎక్కువగా ఉంది..కిరాణా దుకాణాలు, దాబాలు, రెస్టారెంట్లు మొదలైన వాటిలో సాస్ మరియు కెచప్ చాలా అవసరం. మీరు అక్కడ సాస్‌ను కూడా అమ్మవచ్చు. లేదా హోల్ సేల్ వ్యాపారిని సంప్రదించి

మీ ఉత్పత్తిని విక్రయించమని వారిని అడగవచ్చు.. మహిళలను ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేర్చేందుకు ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. మీరు మీ వ్యాపారంలో ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద తక్కువ వడ్డీ రేటుతో రూ. 50,000 నుండి రూ. 10 లక్షల వరకు రుణం పొందవచ్చు..ఈ లోన్ ను మీరు 5 సంవత్సరాల వ్యవధిలో చెల్లించవచ్చు… మీకు ఇలాంటి ఐడియా ఉంటే ఇప్పుడే స్టార్ట్ చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news