ఆవు పేడ ( Cow Dung ) తో వస్తువులు తయారు చేసి చత్తీస్గఢ్ లో మహిళలు డబ్బుల్ని సంపాదిస్తున్నారు. ఆవు పేడను ఉపయోగించి పిడకలే కాకుండా విగ్రహాలు, మొబైల్ ఫోన్ స్టాండ్లు, నర్సరీ పాట్స్ వంటి ఎన్నో ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఛత్తీస్‌గఢ్ లో ‘గోధన్ న్యయ్ యోజన’ అనే పథకం ఉంది. పాడి రైతుల నుంచి ఆవు పేడను కిలోకు రూ. 2 చొప్పున కొనుగోలు చేసి వారికి ఆర్థిక సాయం అందిస్తోంది.
అలానే తయారు చేసిన వస్తువులని ఈ కామర్స్ ద్వారా మార్కెట్ చేయడం తో అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లారు. గ్రామాల్లో మహిళలు ఆవు పేడతో బిజినెస్ మొదలు పెట్టారు. గతం లో ఆవు పేడను పడేసేవారు కానీ ఇప్పుడు మాత్రం ఆవు పేడను బంగారంతో సమానంగా చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు మహిళా స్వయం సహాయక బృందాలు తయారు చేసిన రూ. 1.5 కోట్ల విలువైన 53,000 క్వింటాళ్ల వర్మీ కంపోస్ట్ అమ్ముడయ్యాయి.
అదే విధంగా తయారు చేసిన ఈ వస్తువులని ఆన్ లైన్ లో కూడా అమ్ముతారు. ఆవు పేడ నుండి సహజ పెంట్ తయారు చేయడానికి భారతదేశంలోని గ్రామాల్లో కేవీఐసీ (KVIC) తయారీ యూనిట్ విడుదల చేస్తున్నారు. పర్యావరణ అనుకూలమైన ఆవు పేడతో తయారైన సహజ పెంట్ కి మంచి డిమాండ్ కూడా వుంది. ఇలా పేద తో కూడా ఈజీగా డబ్బులు సంపాదించచ్చు.