బిజినెస్ ఐడియా: బీడు భూమిని సాగు చేస్తూ 18 లక్షలు సంపాదిస్తున్న మహిళా..!

-

చాలా మంది డబ్బులను ఎలా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే నిజానికి వ్యవసాయం చేయడం వల్ల కూడా మంచిగా డబ్బులు సంపాదించవచ్చు. నిజానికి ఈమె వ్యవసాయం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు అని చేసి చూపించారు. కేరళకు చెందిన ఈమె 24 ఎకరాల భూమి లో వరి, పండ్లు, కూరగాయలు మొదలైనవి పండిస్తున్నారు.

 

నిజానికి అది ఒక బీడు భూమి. 62ఏళ్ల భువనేశ్వరి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ చక్కగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక ఈమె వ్యయసాయం గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. మొదట్లో ఎండిపోయిన ఈ భూమి మొత్తం రాళ్ల తో నిండిపోయి ఉండేది. అలాగే భూమి లో సారం కూడా ఉండేది కాదు.

అయినప్పటికీ ఆమె ఎంతో కృషి చేసే మార్పు తీసుకు వచ్చింది. రాళ్లు రప్పలతో ఉండే భూమిను అంతా కూడా ఆమె ఈ శుభ్రం చేసింది. ఆ తర్వాత ఆమె అక్కడ పండించడం మొదలుపెట్టారు. ఎప్పుడూ కూడా ఆమె కెమికల్స్ ని వాడకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ పైన దృష్టి పెట్టారు. చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల వ్యవసాయం చేయడం చూస్తూ ఉండే వారు దీనిపై ఆమెకి వ్యవసాయంపై ఇష్టం ఉంది.

అలాగే వ్యవసాయం గురించి బాగా తెలుసు. దీంతో వ్యవసాయం చేయాలని అనుకున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఈమె ఇప్పుడు మంచిగా సంపాదిస్తున్నారు. అలాంటి 20 ఆవుల్ని కూడా ఈమె పెంచుతున్నారు. ఇలా ఐదేళ్ల నుంచి కూడా ఈమె ఆ బీడు భూమిని మార్చుకుంటూ వస్తున్నారు.

పైగా చక్కటి లాభాలను కూడా పొందుతున్నారు. ఈమెకి తాజాగా కర్షక శ్రీ అవార్డు కూడా లభించింది. ఈమె వయస్సు 67 అయినప్పటికీ కూడా ఎంతో ఎనర్జిటిక్ గా వ్యవసాయం చేస్తున్నారు. రెండు లక్షల ని పెట్టుబడి పెట్టి 18 లక్షల రూపాయలని పొందారు.

Read more RELATED
Recommended to you

Latest news