కేంద్రం ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ ని ప్రజల కోసం తీసుకు వచ్చింది. అలానే ఏపీ ప్రభుత్వం కూడా ఎన్నో స్కీమ్స్ ని ప్రజల కోసం అందిస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం అందించే స్కీమ్స్ లో వైఎస్ఆర్ బీమా పధకం కూడా వుంది. ఇక ఈ పధకం గురించి పూర్తి వివరాల లోకి వెళితే..
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ వర్తించే విధంగా జగన్ ప్రభుత్వం ఈ బీమా పధకాన్ని అందిస్తోంది. కుటుంబ పెద్ద మరణిస్తే బీమా పరిహారం అందేలా వైఎస్సార్ బీమా పథకాన్ని తీసుకు వచ్చారు.
వైఎస్ఆర్ బీమా పధకం ఎంత పరిహారం వస్తుంది..?
కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తు లేదంటే సహజ మరణం పొందితే ఈ బీమా లభిస్తుంది. 18 నుంచి 50 ఏళ్ల వ్యక్తి మరణిస్తే.. అప్పుడు వారి కుటుంబానికి రూ. లక్ష చెల్లిస్తారు. అలాగే 18 నుంచి 70 ఏళ్ల వయసులో ఉన్న వారు ప్రమధుశాత్తు మరణించినా లేదు అంటే అంగవైలక్యం సంభవించినా రూ. 5 లక్షల వరకు వస్తాయి, నేరుగా ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతా లో పడతాయి.
బీమా క్లెయిమ్ చేసిన 15 రోజుల్లోగా డబ్బులు అందుతాయి. రూ.10 వేలు వెంటనే ఆర్థిక సాయంగా అందిస్తారు. పేదలు, అసంఘటిత కార్మిక కుటుంబాలపై భారం పడకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం బీమా ప్రీమియం ఖర్చుని చెల్లిస్తుంది.
ఎవరిని నామినీ కింద పెట్టచ్చు..?
లబ్ధిదారుడి భార్య, 21 ఏళ్ల కుమారుడు, పెళ్లి కాని కుమార్తె, వితంతువు కుమార్తె లేదా ఆమె పిల్లలు లేదా తల్లిదండ్రులును నామినీ కింద పెట్టచ్చు.
ఈ పధకం లో చేరాలి అంటే కావాల్సిన డాక్యుమెంట్లు:
రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, నివాస ద్రువీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా వివరాలు మరియు మొబైల్ నెంబర్ ఈ పధకం లో చేరాలి అంటే అవసరం అవుతాయి.
అధికారిక వెబ్‌సైట్: https://ysrbima.ap.gov.in/