ప్రెగ్నెస్సీ కన్ఫామ్ అవగానే ఆ మహిళ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది తినాలి, ఇది తినొద్దు, ఇలానే నడవాలి, ఇలా పడుకోవద్దు. ఇవి వాడొద్దు. ఇవి మాత్రమే వాడాలి అని అమ్మో చెప్పే వాళ్లు ఎన్నో చెప్తారు. అన్నీ పాటించాలా లేదా అని ఆ మహిళకు కన్ఫూజన్. సాధారణంగా.. కాస్పోమిట్స్ కు దూరంగా ఉండమని అందరూ చెప్తుంటారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సి వచ్చినా.. బాగా నాణ్యత ఉన్నవే వాడాలి అంటారు. అయితే.. సన్ స్క్రీన్ లోషన్ గర్భిణీలు వాడొచ్చా లేదా అని చాలామంది డౌట్ ఉంటుంది. అది కూడా బయటకు వెళ్లినప్పుడు బాడీకి అప్లై చేస్తారు. దీని వల్ల బిడ్డకు ఏమైనా ప్రమాదమా.. అందులో కెమికల్స్ ఎఫెక్ట్ అవుతాయా ఇవన్నీ ఈరోజు చూద్దాం.
సన్‌స్క్రీన్ వాడొచ్చా..
గర్భధారణ సమయంలో సన్‌స్క్రీన్ ఉపయోగించవచ్చని నిపుణులు అంటున్నారు. గర్భదారణ సమయంలో యూవీ కిరణాలు.. నేరుగా శిశువుపై పడకూడదు. తల్లి చర్మానికి నష్టం జరిగితే.. శిశువుపైనా ప్రభావం పడుతుంది. అయితే.. గర్భిణీలు రసాయనాలు లేని, సహజ పదార్థాలు ఉన్న సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది వద్దు..
సన్‌స్క్రీన్‌లో ఆక్సిబెంజోన్ అనే పదార్ధం ఉంటుంది. దీన్ని ఎండోక్రైన్ డిస్‌రప్టర్ అని పిలుస్తారు, ఇది గర్భిణీలకు హాని చేస్తుంది. గర్భధారణ సమయంలో ఆక్సిబెంజోన్ కలిగిన ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల క్షీర గ్రంధులకు తీవ్రమైన నష్టం కలుగుతుందని.. 2018లో చేసిన ఓ అధ్యయనం వెల్లడించింది. ఇవి బిడ్డ పుట్టిన తర్వాత.. వారి ఆరోగ్యానికి చాలా ముఖ్యం.ఇంకా ఈ ఆక్సిబెంజోన్ కారణంగా మానవుల వీర్యం, మావి, తల్లిపాలు కలుషితం చేస్తుందని ఎన్నో అధ్యయనాలు చూపించాయి.
ఏది వాడాలి..
గర్భిణీలు మినరల్/ఫిజికల్ సన్‌స్క్రీన్‌ని ఉపయోగించవచ్చు. మినరల్ సన్‌స్క్రీన్‌లలో జింక్ ఆక్సైడ్ ఉంటుంది. ఇది కెమికల్స్ ఉన్న సన్‌స్క్రీన్‌ల కంటే చాలా సురక్షితమైనది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌లలో ముఖ్యమైన వస్తువుగా జింక్ ఆక్సైడ్‌ను ఆమోదించారు. స్కిన్ కు వాడే ఉత్పత్తుల విషయంలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి.! వైద్యుల సలహా మేరకే ఎంచుకోవడం ఉత్తమం.!