రోజు ఉదయాన్నే నల్ల ఉప్పు నీళ్లు తాగితే.. బరువు తగ్గొచ్చా..?

-

ఉప్పు ఆరోగ్యానికి అంత మంచిది కాదు.. వాడితే ఎముకలు దెబ్బతింటాయి..కానీ నల్ల ఉప్పు ఆరోగ్యానికి మంచిది.. మనకు తెల్ల ఉప్పు మాత్రమే బాగా తెలుసు. నల్ల ఉప్పు గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది.
నల్ల ఉప్పుకు ప్రత్యేకమైన రుచి, వాసన కలిగి ఉంటుంది. ఇది వంటల్లో వేస్తే రుచి డబుల్‌ అవతుంది. రోజు ఈ ఉప్పు నీరు తాగడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయట… అవేంటంటే..
మధుమేహం నుంచి ఉపశమనం కల్పిస్తుంది- తెల్ల ఉప్పులో సోడియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. డయాబెటిక్ పేషెంట్స్ బ్లాక్ సాల్ట్ వాటర్ తీసుకుంటే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.
జీర్ణక్రియలో- ప్రతిరోజూ ఉదయం నల్ల ఉప్పు నీటిని తాగితే జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇది కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్, ప్రోటీన్‌లను జీర్ణం చేసే ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఉండవు.
బరువు తగ్గుతుంది- ఊబకాయం అనేక వ్యాధులకు గేట్ పాస్‌ లాంటింది. ఇది వచ్చిందంటే.. వరసపెట్టి అన్ని రోగాలు బోర్డర్‌ దాటేస్తాయి. ప్రస్తుతం చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. నల్ల ఉప్పు నీటిలో యాంటీ ఒబెసిటీ లక్షణాలు ఉన్నాయి. దీని కారణంగా పెరుగుతున్న బరువు వేగంగా తగ్గడం ప్రారంభమవుతుంది.
జుట్టుకు మంచిది- బ్లాక్ సాల్ట్ ఎక్స్‌ఫోలియేటింగ్, క్లెన్సింగ్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. జుట్టు అందగా మార్చడానికి కూడా నల్ల ఉప్పు బాగా పనిచేస్తుంది.
నల్ల ఉప్పును రైతా, సలాడ్, డ్రింక్స్, ఫ్రూట్ సలాడ్ వంటి వాటిలో బ్లాక్ సాల్ట్ ను ఉపయోగిస్తారు. బ్లాక్ సాల్ట్‌ రుచిని సైతం పెంచుతుంది. దాదాపు ఈరోజుల్లో అందరికీ ఉండే కామన్‌ ప్లాబ్లమ్స్‌ ఇవి. వీటన్నింటికి నల్ల ఉప్పు చక్కగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు కాబట్టి..ఇంట్రస్ట్‌ ఉండే వాడటంలో తప్పు లేదు. మధుమేహ వ్యాధి గ్రస్తులు అయితే ఒకసారి మీ వైద్యుల సలహా మేరకే ఇలాంటి చిట్కాలను ప్రయత్నించండి.

Read more RELATED
Recommended to you

Latest news