కేబుల్ బ్రిడ్జిపై కారు నడిపిన టూరిస్టులు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు

-

గుజరాత్‌లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి దుర్ఘటనకు కొందరు ఆకతాయిలు వంతెనను ఊపడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ ఘటన నుంచి పాఠం నేర్చుకుని కేబుల్ బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాల్సిపోయింది కొందరు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కర్ణాటకలోని ఓ కేబుల్ బ్రిడ్జిపైకి కొందరు టూరిస్టులు కారును ఎక్కించి నడిపే ప్రయత్నం చేశారు.

ఉత్తర కన్నడ జిల్లా యెల్లపురాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన శివపుర కేబుల్ బ్రిడ్జిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు మహారాష్ట్ర నుంచి వచ్చిన కొందరు టూరిస్టులు సస్పెన్షన్ బ్రిడ్జిపైకి కారును తీసుకొచ్చారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వారిని అడ్డుకున్నారు. కారు బరువు కారణంగా వంతెన కూలే ప్రమాదం ఉందని హెచ్చరించి వారిని వెనక్కి పంపించారు. అయినా వాళ్లు వినిపించుకోకుండా స్థానికులతో వాగ్వాదం చేస్తూ కారును వంతెనపై కొంతదూరం తీసుకొచ్చారు.

స్థానికులు గట్టిగా అభ్యంతరం చెప్పడంతో టూరిస్టులు కారును వెనక్కి తీసుకెళ్లారు. కారును తోసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కారు వెనుక చాలా మంది ఉన్నారు. వాహనాన్ని తోసేప్పుడు వంతెన ఊగుతూ ప్రమాదకరంగా కన్పించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news