క్రియేటివ్ కామెడీకి కేరాఫ్ అడ్ర‌స్ సంపూర్ణేశ్ బాబు..

-

బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు.. ఈ పేరు వింటే చాలు నవ్వు ఆగ‌దు. మ‌రి అంత‌లా త‌న సినిమాల‌తో ప్రేక్ష‌కులు క‌డుపుబ్బా న‌వ్వించారు ఆయ‌న‌. కేవ‌లం ఒకే ఒక్క సినిమాతో స్టార్ అయిపోయారు. పెద్ద‌గా ఫిజిక్‌, డ్యాన్సులు, క‌టౌట్ లాంటివి ఏం లేక‌పోయినా.. త‌న ట్యాలెంట్‌తో వ‌రుస ఆఫ‌ర్ల‌ను త‌న ఖాతాలో వేసేసుకుంటున్నారు ఈ తెలంగాణ స్టార్‌.

బేసిగ్గా తెలంగాణ వాసి అయిన ఆయ‌న సినిమాల‌పై ఇష్టంతో లేటు వ‌య‌సులో ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. అయినా స్టార్‌గా ఎద‌గ‌డానికి ఎక్కువ టైమ్ ప‌ట్టలేదు. హృద‌య కాలేయం సినిమాతో ఓవ‌ర్‌నైట్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక అక్క‌డి నుంచి వెను తిరిగిచూసుకోలేదు. క్రియేటివ్ కామెడీని బేస్ చేసుకుని కొత్త త‌ర‌హా క‌థ‌ల‌తో సినిమాలు చేశారు.

సింగం 123, కొబ్బ‌రిమ‌ట్ట లాంటి సినిమాలు మ‌నోడికి మంచి పేరు తెచ్చాయి. ప్ర‌స్తుతం బ‌జార్‌రౌడీ చేస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది. ఇక తాజాగా ఆయ‌న క్యాలీఫ్ల‌వ‌ర్‌తో వ‌స్తున్నారు. మే9న ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైన పోస్ట‌ర్ చాలా ఆక‌ట్టుకుంటోంది. ఇంగ్లీష్ దొర‌బాబుగా ఆయ‌న క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఈ సినిమాతో ఇంకెంత కామెడీని క్రియేట్ చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version