వైరల్ ఫోటోలు: నిశ్చితార్థం చేసుకున్న కేరింత నటి

-

సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన చిత్రం ‘కేరింత’. ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో శ్రీ దివ్య మెయిన్ హీరోయిన్ అయినా.. మరోనటి సుకృతి తన యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది. సుకృతి పేరు అంటే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు.. కానీ ఆ సినిమాలో ‘భావన’ అనే పాత్ర అందరికీ గుర్తుకు ఉండే ఉంటుంది. భావన పాత్ర కేరింత సినిమాకే ప్లస్ అయింది. ఆ తర్వాత ఆమె తన వ్యక్తిగత కారణాల వల్ల పెద్దగా సినిమాలు చేయలేదు. అయితే సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు.

 

View this post on Instagram

 

A post shared by Akshay Singh (@singhakshay)

అయితే ఆమెకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతోంది. సుకృతి త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. అక్షయ్ సింగ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో పలువురు సినీ నటులు, అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిశ్చితార్థంకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి.. తన తండ్రి గురించి ఓ ఎమోషన్ పోస్ట్ చేసింది. ‘ఎప్పటికీ నువ్వే నా ఫస్ట్ లవ్ డాడీ’ అని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news