మంత్రి మల్లారెడ్డిపై దాడి.. కేసు నమోదు..!!

-

మంత్రి మల్లారెడ్డిపై దాడి ఘటనలో కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మల్లారెడ్డిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నాయకులు సోమవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఇద్దరు కాంగ్రెస్ నేతలైన సోమశేఖర్ రెడ్డి, హరివర్ధన్ రెడ్డి పేర్లు ఉన్నాయి. వీరితోపాటు మొత్తం 16 మందిపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 147, 173, 149, 352, 341, 506 ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి అనుచరులే దాడికి ఒడిగట్టారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

మంత్రి మల్లారెడ్డి
మంత్రి మల్లారెడ్డి

కాగా, ‘రెడ్ల సింహ గర్జన’ సభకు హాజరైన మంత్రిపై ఆదివారం దాడులు జరిగాయి. ఈ దాడిపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తనపై జరిగిన దాడి వెనుకాల కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హస్తం ఉందన్నారు. రెడ్డిల ముసుగులో తనపై హత్నాయత్నానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. తనపై దాడికి పాల్పడిన గుండాలపై చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. అయితే రెడ్ల సింహ గర్జన సభలో మంత్రి మల్లారెడ్డి సభకు సంబంధించిన అంశాలు కాకుండా.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల గురించి, సీఎం కేసీఆర్ గురించి మాట్లాడటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news