రైతులకు శుభవార్త.. 31న ఖాతాల్లో నగదు జమ..!!

-

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు 11వ విడత కింద రైతుల ఖాతాలో నగదు జమ చేయనుంది. రూ.21,000 కోట్లకు పైగా నిధులను మే 31వ తేదీన లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనుంది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం శనివారం అధికారిక ప్రకటన జారీ చేసింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా దేశంలో తొమ్మిది మంత్రిత్వ శాఖలు, పదహారు పథకాల కార్యక్రమాల గురించి వివరించనుంది.

ప్రధాని మోదీ

గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ పేరుతో ఈ నెల 31న సిమ్లాలో జాతీయ స్థాయి కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ 11వ విడత కిసాన్ సన్మాన్ నిధిని విడుదల చేయనున్నారు. చిన్న, సన్నకారు రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఏడాదికి మూడు విడతల్లో రూ.6 వేలు జమ చేస్తోంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2018లో ప్రారంభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version