టీటీడీ పాలక మండలి సేవలపై టిటిడి ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. నిరంతరంగా ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని.. మొదటి విడతగా తెలుగు రాష్ట్రాలలో 502 శ్రీవారి ఆలయాలు నిర్మించామన్నారు టిటిడి ఈవో ధర్మారెడ్డి. రెండో విడతగా 1130 ఆలయాల నిర్మాణం, జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నాయని.. విశాఖపట్నం, భువనేశ్వర్, అమరావతిలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాలను ప్రారంభించామని స్పష్టం చేశారు.
రూ.23 కోట్లతో నూతన పరకామణి భవనం త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. టిటిడి ఉద్యోగులకు నగదు రహిత వైద్యసేవలు నిర్వహిస్తామని.. తిరుమలలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అని తేల్చి చెప్పారు. టిటిడిలో 7,260 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించామని.. బర్డ్ ఆసుపత్రిలో సెరిబ్రల్ పాల్సీ పిల్లలకు ప్రత్యేక వైద్యం అందిస్తామన్నారు. శ్రీపద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని రెండేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటన చేశారు టిటిడి ఈవో ధర్మారెడ్డి.