సర్పంచులకు ఉన్న తెలివి కూడా సీఎం జగన్ కు లేదని చంద్రబాబు చురకలు అంటించారు. సుబ్రహ్మణ్యం అన్నా అంటూ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంని శుభ్రంగా బాపట్ల పంపారని.. తర్వాత సవాంగ్ అన్నా అంటూనే డీజీపీని పీకేశారని ఫైర్ అయ్యారు. అధికారుల్లో వ్యతిరేకత గమనించి ఏపీపీఎస్సీ చైర్మన్ ఇచ్చారని.. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేయించారని అగ్రహించారు.
రాష్ట్రంలో గంజాయి లేదని బుకాయించిన డీజీపీనే రూ.300 కోట్ల విలువైన సరుకును తగలపెట్టారని.. జగన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి ఊరూరా చెప్పాలన్నారు. బాబాయ్ హత్య గురించి ఏం చెప్పినా ప్రజలు గొర్రెల మాదిరి నమ్ముతారన్నది జగన్ భావన అని.. సవాంగ్ పనులను మేము సమర్ధించడం లేదు.. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
స్కూల్లో టీచర్ దగ్గర పోలీసులను కూర్చో పెట్టారని.. నా కాన్వాయిపై రాళ్ళేస్తే భావ ప్రకటన అని సవాంగ్ చెప్పాడన్నారు. మంత్రి అప్పల రాజు పోలీసులపై దాడి చేస్తే చర్యలు లేవని.. టీడీపీ కార్యాలయం పై దాడి చేస్తే చర్యలు లేవన్నారు. వివేకా హత్యలో అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐ ఛార్జ్ షీట్ లో పెట్టారని.. సీబీఐ కక్ష కట్టిందని సకల శాఖల మంత్రి సజ్జల అంటున్నారని మండిపడ్డారు. కోర్టులు లేకపోతే ఎంపీ రఘురామ రాజును ఏమి చేసేవాళ్ళో? ? అని ఫైర్ అయ్యారు. హత్యలు చేసేవాళ్ళు అధికారం లో ఉంటే.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనని.. రూ. 26 వేల కోట్ల నరేగా నిధులు వేస్తే 3 ఏళ్లలో వైసీపీ ఒక్క రోడ్డు వేయలేదన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల కార్యక్రమంలో డబ్బులు కొట్టేశారని మండిపడ్డారు.