మా రాజ్యం వస్తది.. మీ సంగతి తేలుస్తాం. సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి వార్నింగ్

-

తెలంగాణలో తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ.. చదివించినా…ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని దీంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దీనికి టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని రేవంత్ రెడ్డి విమర్శించారు. నిరసన తెలపడానికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను, నిరుద్యోగులను అరెస్ట్ చేయడంతో పాటు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మా రాజ్యం వస్తుందని.. మీ సంగతి తేలుస్తామని కేసీఆర్కు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నిరుద్యోగులు హమాలీగా, ఉపాధి హామీ కూలీలుగా మారారని అన్నారు. 1.90 లక్షల ఉద్యోగాలు ఉన్నా.. టీాఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. 

కేసీఆర్ కుటుంబంలో ఉన్న నలుగురు దుష్ట చతుష్టయంగా మారారని… వేలాది భూములు భూములు ఆక్రమించుకుంటున్నారని… కోట్లు సంపాదిస్తున్నారని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ విద్యార్థి సంఘం నేతలు ఉస్మానియా యూనివర్సిటీల్లో బహుజన విద్యార్థులపై దాడులు చేశారని అన్నారు. పోలీసుల్లో కొంతమంది బానిసలుగా మారారని.. డీజీపీ నిజాయితీగా వ్యవహరించాలని అన్నారు. కోర్టుకు వెళ్లాల్సిన సమయంలో నన్ను పోలీసులు అరెస్ట్ చేశారని విమర్శించారు. re

Read more RELATED
Recommended to you

Latest news