కరోనాపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పలు రాష్ట్రాలలో కోవిడ్ కేసుల పెరుగుదలతో కేంద్ర ఆరోగ్య మంత్రుత్వ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలలో కోవిడ్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది కేంద్ర ఆరోగ్య మంత్రుత్వ శాఖ.
కోవిడ్ కేసులను అరికట్టడానికి వ్యూహాన్ని అనుసరించాలని కోరింది కేంద్ర ఆరోగ్య శాఖ. టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్ వేగంవంతం చేయాలని రాష్ట్రాలకు సూచనలు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.
కాగా.. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 7240 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,97,522 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 32,498 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 08 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,24,723 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3591 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,26,40,301 కు చేరింది.