“ఫేక్ వీడియోలు” చేస్తే మూడేళ్ళ జైలు శిక్ష: కేంద్ర ప్రభుత్వం

-

సోషల్ మీడియా పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి మరియు సెలెబ్రెటీలకు సంబంధించి ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇంతకు ముందు చాలా మంది విషయాలలో ఇలా జరిగింది. ఇక తాజాగా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నమొఖాన్ని వాడుకుని వేరే అమ్మాయి వీడియోను సోషల్ మీడియా లో వైరల్ చేశారు. ఈ వీడియోపై ప్రముఖులు చాలా మంది విమర్శలు గుప్పించారు. ఇక ఎట్టకేలకు ఈ విషయం పైన కేంద్ర ప్రభుత్వం స్పందించింది.. ఫేక్ వీడియోలు ను సృష్టించడం కానీ లేదా వాటిని వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో షేర్ చేయడం తగదు అంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

ఇక ఈ విధంగా చేసిన వారికి ఇన్కమ్ టాక్స్ చట్టం ప్రకారం మూడు సంవత్సరాల జైలు శిక్ష తో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తామని తెలిపింది. ఫస్ట్ ప్రయారిటీ కింద దేశ పౌరుల భద్రత కోసమే కట్టుబడి ఉంటామంటూ కేంద్రం పేర్కొన్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version