కేంద్రం మరో అడుగు వెనక్కి.. వ్యవసాయ వ్యర్థాల దహనం నేరం కాదు

-

దేశ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల మరో డిమాండుకు కేంద్ర ప్రభుత్వం తగ్గింది. పంటలు కోసిన తర్వాత వ్యవసాయ వ్యర్థాలను దహనం చేయడం నేరం కింద పరిగణించకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, ఈ విషయం రైతు సంఘాల నేతలకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమాచారం ఇచ్చారు. నవంబర్ 29న పార్లమెంట్‌కు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ వర్థాల దహనాన్ని నేరంగా పరిగణించడంపై వెనక్కి తగ్గడం గమనార్హం. మూడు సాగు చట్టాలను తీసుకువచ్చి నవంబర్ 29 నాటికి ఏడాది పూర్తి కావడం, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అదే రోజు ప్రారంభమవుతుండటంతో భారతీయ కిసాన్ యూనియన్ ట్రాక్టర్ ర్యాలీ తలపెట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుండటంతో ట్రాక్టర్ ర్యాలీ రైతు సంఘాల నేతలు వాయిదా వేశారు.

అంతకుముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. శీతాకాల సమావేశాలు ప్రారంభం కాగానే సంబంధిత బిల్లు ప్రవేశ పెడుతామని స్పష్టం చేశారు.

అయితే, భారతీయ కిసాన్ యూనియన్ భిన్నంగా స్పందించారు. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండుకు కేంద్రం అంగీకారం తెలిపిన తర్వాతనే రైతులు ఇంటికి వెళ్తారని రాకేశ్ టికాయత్ ఖరాఖండిగా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version