మోస్ట్ వాంటెడ్ చైన్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ పరారయ్యాడు. అహ్మదాబాద్ పోలీసుల అదుపులో ఉన్న ఉమేష్ పరారయ్యాడు. కోర్టు అనుమతితో ఉమేష్ ను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే పీటీ వారెంట్ పై ఉమేష్ ను హైదరాబాద్ తీసుకువచ్చేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ పరారీ జరిగింది. ఉమేష్ పరారీపై తెలంగాణ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గత నెల 19న హైదరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో ఒకే రోజు వరసగా ఆరు చైన్ స్నాచింగులు చేసి సంచలన కలిగించాడు. స్కూటీపై తిరుగుతూ.. గంటల వ్యవధిలో దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు చాలా కష్టపడ్డారు. సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా నిందితుడు.. గుజరాత్ కు చెందిన ఉమేష్ ఖతిక్ గా గుర్తించారు. నిందితుడిని అహ్మదాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ లోనూ మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఉమేష్ ను అప్పగించేందుకు సూరత్ పోలీసులు హైదరాబాద్ పోలీసులకు అప్పగించేందుకు ఒప్పుకోలేదు. కోర్టులో పీటీ వారెంట్ వేసి నిందితుడిని తీసుకెళ్లాలని సూరత్ పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సూచించారు. తాజాగా ఉమేష్ మా కస్టడీ నుంచి తప్పించుకున్నట్లు హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.