రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లగలను… నన్ను అడ్డుకుంటే ఖబద్ధార్: చంద్రబాబు

-

టెన్త్ పేపర్ లీక్ అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని… పేపర్ లీక్ వెనక వైసీసీ నేతల హస్తం ఉందని ఆరోపించారు చంద్రబాబు నాయుడు. మంత్రి బొత్స పేపర్ లీక్ అవుతుంటే ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్లగలను, ఏ ఇంటికైనా వెళ్లగలను నన్ను అడ్డుకుంటే ఖబద్ధార్ అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు చంద్రబాబు. డీజిల్, పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. ఏపీలో కన్నా ఇతర రాష్ట్రాల్లో పన్నులు ఎక్కువగా ఉన్నాయని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ విసిరారు. పేపర్లు లీక్ కాకుండా పనిచేయలేని మంత్రులు ఈ రాష్ట్రానికి అవసరమా..? అంటూ ప్రశ్నించారు. కాపీ కొట్టించడంలో కూడా వైసీపీ లీడర్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. ఎవరైనా పేపర్లు లీక్ చేయాలని అనుకుంటారా అని వైసీపీని ప్రశ్నించారు. జగన్, విజయసాయి వైజాగ్ భూములను ఖబ్జా చేస్తున్నారని విమర్శించారు. ఓ ఫైనాన్సియల్ హబ్, ఐటీ హబ్, టూరిజం, ఫార్మా హబ్ గా విశాఖను దేశంలో అగ్రపథాన నిలబెట్టాలని నేను చూశానని అన్నారు. విశాఖ డెవలప్ కావాలా… రాజధాని కావాాలా అని ప్రజలను ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version