తెలంగాణ నేతలు ఏపీ గురించి మాట్లాడుతోంటే బాధ అనిపిస్తుంది – చంద్రబాబు

-

తెలంగాణ నేతలు ఏపీ గురించి మాట్లాడుతోంటే బాధ అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు నారా చంద్రబాబు. ఏపీలో ఏముందని.. తెలంగాణ నేతలంటున్నారు… కనీసం రోడ్లైనా లేవని తెలంగాణ నేతలు ఏపీ గురించి మాట్లాడుతున్నారని తెలిపారు. ఏపీ గురించి అలా మాట్లాడుతోంటే బాధ అనిపించడం లేదా..? అని వైసీపీపై ఫైర్‌ అయ్యారు.

విశాఖ రామానాయుడు స్టూడియో భూములనూ కొట్టేశారు… భూములు.. సంస్థలను అడ్డగోలుగా రాయించుకున్నారని నిప్పులు చెరిగారు. ఏలూరు జిల్లా లో ఉన్న నూజివీడు ను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలనే డిమాండ్ ఉంది… అధికారంలోకి వచ్చాక నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు బాబు. వైసీపీని నమ్ముకుని ఆ పార్టీ కార్యకర్తలు కూడా నష్టపోయారు…వైసీపీ విధానాలతో ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. సర్పంచులు కూడా నిధుల్లేక ఇబ్బందులు పడుతున్నారు… ప్రభుత్వం తీరు ఎంత దారుణంగా ఉందనే అంశం వైసీపీ కార్యకర్తలకూ అర్థమైందని ఆరోపణలు చేశారు చంద్ర బాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version