కాంగ్రెస్ పంచితే.. టీఆర్‌ఎస్‌ గుంజుకుంటోంది : ఎమ్మెల్యే సీతక్క

నేడు ఇందిరా పార్క్‌ వద్ద కాంగ్రెస్‌ ధరణి రచ్చబండ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ధరణి బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. భూముల విలువ పెంపకం పేరుతో దందాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. దున్నే వానికి భూమి లేకుండా కేసీఆర్ చేస్తుండు.. ఫార్మా సిటీ కోసం అడ్డగోలుగా భూములను దోచే ప్రయత్నం చేస్తుండు కేసీఆర్ అంటూ ఆమె ఆరోపణలు చేశారు. ఎక్కడ భూములున్నా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, మరోవైపు ఫారెస్ట్ అధికారులు కూడా భూములను లాకుంటున్నారని ఆమె మండిపడ్డారు.

KCR pushed Telangana into debt trap, flays Seethakka

పోడు రైతులపై దాడులు చేస్తున్నారని, మహబూబాబాద్ జిల్లా నారాయణపూర్ లో ధరణితో 18వందల ఎకరాలు ఆగమయ్యాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి అంటే తరతరాలుగా వచ్చే ఆధారమని, అడవులున్న చోటే మళ్లీ అడవుల పెంపకం చేస్తున్నారని, కాంగ్రెస్ పంచితే.. టీఆర్‌ఎస్‌ గుంజుకుంటోందని ఆమె ధ్వజమెత్తారు. భూ సమస్యలతో చాలా మంది చనిపోతున్నారన్న ఎమ్మెల్యే సీతక్క.. మొన్నటివరకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు టీఆర్‌ఎస్‌ నేతల పేరుపై మారుతున్నాయన్నారు.