మరోసారి వైసీపీ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. నిన్న నందిగామ జగ్గయ్యపేటల్లో జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడారు. రోడ్‌షోలోనూ పాల్గొన్నారు. అయితే.. చంద్రబాబు రోడ్ షోలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు దుండగులు. అయితే.. తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ.. కోడికత్తి డ్రామాలు ఆడే నాయకుడు.. బాబాయిని హత్యను గుండెపోటుగా చెప్పే నాయకుడు.. ఇలాంటి నాటకాలరాయుళ్లా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది! మున్ముందు కోడికత్తి లాంటి డ్రామాలు చాలా వస్తాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. నాటకాలరాయుడిని సాగనంపడానికి సిద్ధంగా ఉండాలన్నారు. పేదలను వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో మోసం చేస్తోందని, అవి నవరత్నాలు కాదని నవద్రోహాలని విమర్శించారు చంద్రబాబు. ‘పవన్ కల్యాణ్ చెప్పు చూపిస్తే.. విమర్శలు చేస్తారా..? నీలాంటి నీచులకు చెప్పు కాక ఏం చూపించాలి’ అని సీఎంపై నిప్పులు చెరిగారు చంద్రబాబు.
రాష్ట్రంలో పోలీసులను అడ్డంపెట్టుకుని జగన్ రౌడీ రాజ్యం సాగిస్తున్నారని, 0.2 సెంట్లు కోసం అయ్యన్నను అర్ధరాత్రి పోలీసులు దొంగల్లా వచ్చి అరెస్టు చేశారని.. రౌడీల్లా లాక్కువెళ్లారని విమర్శించారు చంద్రబాబు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉచితంగా వచ్చిన ఇసుక.. ఇప్పుడు ట్రాక్టర్ రూ.5 వేలు నుంచి 10వేలకు అమ్ముతున్నారు. ఇక్కడో ఎమ్మెల్యే.. ఆయనకు తోడు ఎమ్మెల్సీ ఉన్నారు. వారిద్దరూ కలిసి ఇసుక, మట్టిని దోచేస్తున్నారు. ప్రపంచమంతా ఆన్‌లైన్ పేమెంట్లు జరుగుతుంటే జగన్‌రెడ్డి మద్యం షాపుల్లో మాత్రం క్యాష్ అండ్ క్యారీ అమలవుతోంది. ఆ సొమ్మంతా సాయంత్రమయ్యేసరికి తాడేపల్లి ప్యాలె్‌సకు వెళ్తోంది. అమ్మఒడి అని డబ్బులు వేస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు.