ఐపీఎస్ సంపత్ కుమార్‌పై మద్రాసు హైకోర్టులో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కేసు దాఖలు చేశాడు. నేరారోపణ కింద విచారణ చేపట్టాలని కోర్టుని కోరాడు. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో సుప్రీం కోర్టు, మద్రాసు హైకోర్టుపై ఐపీఎస్ సంపత్ కుమార్ అనుచిత ఆరోపణలు చేసినట్లు ధోని తన కేసులో ఫిర్యాదు చేశాడు. జస్టిస్ పీఎన్ ప్రకాశ్, జస్టిస్ తీకా రామన్‌లతో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు లిస్టు అయ్యింది. వచ్చే వారం ఈ కోర్టు ధిక్కరణ కేసును విచారించనున్నారు.
సుప్రీం కోర్టు, మద్రాసు మైకోర్టు తీర్పులను ఐపీఎస్ ఆఫీసర్ తప్పుబట్టారని, ఆయన చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను కించపరిచినట్లుగా ఉందని, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని ధోని మద్రాసు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆరోపించారు. 2103 ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ పై విచారణ చేపట్టిన ముద్గల్ కమిటీ నివేదికపై ఐపీఎస్ సంపత్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. సిట్‌కు సీల్డ్ కవర్‌లో ఉన్న సమాచారాన్ని ఇవ్వలేదని సంపత్ ఆరోపించారు. సుప్రీంకోర్టు తమకు సీల్డ్ కవర్ సమాచారాన్ని చేరవేయలేదని సంపత్ చేసిన ఆరోపణలను తప్పుబడుతూ ధోని కేసు దాఖలు చేశారు.