అభివృద్ధిలో ఏపీ చివరి స్థానంలో ఉంది : చంద్రబాబు

-

కర్నూలు జిల్లాలో 3 రోజులు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో రెండో రోజు గురువారం కర్నూలు జిల్లా ఆదోని లో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధిలో ఏపీ చివరి స్థానంలో ఉందని, విద్యార్థులను గంజాయి మత్తులోకి దించుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ‘డబ్బులు సంపాదించే మార్గం నాకు తెలుసు.. ఆస్తులు తాకట్టు పెట్టే మార్గం జగన్‌కు తెలుసు’అని చంద్రబాబు అన్నారు. తనపై కేసు పెట్టేందుకు వైఎస్సార్ (YSR) కూడా సాహసించలేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా టీడీపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు చంద్రబాబు. ఆదోనిలో స్థానికంగా ఇసుక దొరకడం లేదు.. కానీ హైదరాబాద్, బెంగళూరులో దొరుకుతోందని.. సాయంత్రానికి తాడేపల్లి నివాసానికి లారీల్లో డబ్బులు చేరుతున్నాయని చంద్రబాబు అన్నారు. ఈడీ దాడుల భయంతోనే జగన్ వైన్ షాపుల్లో.. ఆన్‌లైన్ పేమెంట్లు తీసుకోవడం లేదని ఆరోపించారు.

Chandrababu Tour : వస్తున్నా మీకోసం.. వైసీపీని ఎదుర్కొనేందుకు చంద్రబాబు  పక్కా ప్లాన్ - 10TV Telugu

నాసీరకం పత్తి విత్తనాలతో రైతులు నిండా మునిగారన్నారు చంద్రబాబు. ఒకే రాజధాని కావాలని ఆదోని ప్రజలు చెబుతున్న విషయాన్ని.. తాడేపల్లి నివాసంలో ఉన్న జగన్ (Jagan), పేటీఎం బ్యాచ్ చూడాలన్నారు. సీఎం జగన్‌కు ధమ్ముంటే.. ఆదోని వచ్చి మూడు రాజధానుల గురించి అడగాలన్నారు చంద్రబాబు. తాను తలుచుకుంటే సాక్షి పేపర్ మనుగడ ఉండేదా? అని ప్రశ్నించారు. మీడియా ప్రసారాలను పురుద్ధరించకపోతే.. అధికారంలోకి వచ్చిన వెంటనే కేబుల్ నెట్‌వర్క్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 150 అన్న క్యాంటీన్లను మూసివేసి పేదల కడుపుకొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. తాను సీఎం అయి ఉంటే పెన్షన్లు రూ.3 వేలు ఇచ్చే వాడినని చంద్రబాబు వ్యాఖ్యానించారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news