మతాలకు, కులాలకు చిచ్చుపెట్టి చలికాచుకునే నువ్వు రాజకీయం చేస్తావా? : చంద్రబాబు

-

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కర్నూలు జిల్లాలో నేడు మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కర్నూలు టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ చంద్రబాబు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు ఎవరేం చేశారో చర్చించడానికి తాను సిద్ధమని అన్నారు. ఎవడ్రా రాయలసీమ ద్రోహి… పనికిమాలిన దద్దమ్మల్లారా! అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. జగనే రాయలసీమ ద్రోహి అని పేర్కొన్నారు. రాయలసీమను దోచుకునే శక్తి వైసీపీకి ఉందని, రాయలసీమను సస్యశ్యామలం చేసే శక్తి టీడీపీకే ఉందని వివరించారు చంద్రబాబు. రాయలసీమను తాము రతనాల సీమ చేస్తే, జగన్ రెడ్డి రాయలసీమకు ద్రోహం తలపెడుతున్నాడని విమర్శించారు చంద్రబాబు.

Chandrababu Naidu: People gathered for Chandrababu's road show in  Emmiganoor of Kurnool district.

జగన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శించారు చంద్రబాబు. “విశాఖ వెళ్లి ఉత్తరాంధ్ర వాళ్లను రెచ్చగొడతావు, రాయలసీమ వచ్చి ఇక్కడి వాళ్లను రెచ్చగొడతావు. మతాలకు, కులాలకు చిచ్చుపెట్టి చలికాచుకునే నువ్వు రాజకీయం చేస్తావా? ఇదేం పులివెందుల అనుకుంటున్నావా… తరిమి తరిమి కొట్టిస్తా. వైసీపీ గూండాలు ఒకటే గుర్తుపెట్టుకోండి… బట్టలిప్పి కొట్టిస్తా. మర్యాదకు మర్యాద… దెబ్బకు దెబ్బ. ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలైనా ఇస్తా. 23 బాంబులకే భయపడలేదు. నాపైనే దాడి చేయాలనుకుంటున్నారు… మా కార్యకర్తలకు నేను కనుసైగ చేస్తే మీరు చిత్తు చిత్తు అవుతారు” అంటూ హెచ్చరించారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news