ఒక సైకో ఊరికొక సైకోను తయారుచేశాడు : చంద్రబాబు

-

ఇంత నీచమైన సీఎంను తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన శుక్రవారం.. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. కొవ్వూరు నుంచి నిడదవోలు వరకు భారీ రోడ్ షో నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఇంత నీచమైన సీఎంను తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు చంద్రబాబు. ఏపీకి పట్టిన ఐదేళ్ల శనిని వదిలించుకునేందుకు ప్రజలు సిద్ధం కావాలని తెలిపారు. రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోందని, ఒక సైకో ఊరికొక సైకోను తయారుచేశాడని విమర్శించారు. సైకో పాలనలో రాష్ట్రం అధోగతిపాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయని, అమరరాజా కంపెనీ కూడా తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు చంద్రబాబు. అమరరాజా గ్రూప్ తెలంగాణలో రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెడుతోందని తెలిపారు.

అమరరాజా సంస్థను వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని చంద్రబాబు ఆరోపించారు. అమరరాజాను గత ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే, ఈ సీఎం వేధించారని మండిపడ్డారు చంద్రబాబు. ఇవాళ ఏపీ వ్యక్తి మరో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు చంద్రబాబు. నారాయణ విద్యాసంస్థల అధినేతకు కూడా వేధింపులు ఎదురవుతున్నాయని తెలిపారు. కేసులపై కేసులు పెడుతూ నారాయణను వేధిస్తున్నారని వివరించారు. రాజకీయ దురుద్దేశాలతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు చంద్రబాబు. రాష్ట్రాన్ని సైకో బారి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పిలుపునిచ్చారు. సీఎం పదవి తనకేమీ కొత్త కాదని, రాష్ట్ర భవిష్యత్తు నాశనమవుతుండడం బాధ కలిగిస్తోందని చెప్పారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version