అభివృద్ధిలో పోటీపడిన ఏపీ నేడు మనుగడ కోసం పోరాడాల్సి వస్తోంది : చంద్రబాబు

-

సీబీఎన్ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని నిరుద్యోగులు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లతో చంద్రబాబు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధిలో పోటీపడిన ఆంధ్రప్రదేశ్ నేడు మనుగడ కోసం పోరాడాల్సి వస్తోందన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం సమష్టిగా పోరాడాల్సిన అవసరం అందరిపైనా ఉందని, శాసన మండలిలో ఉపాధ్యాయ సమస్యలపై పోరాడే వారికే ఓటేయండని ఆయన కోరారు. ఒక్కో టీచర్ కు రూ.5 వేలు ఇచ్చి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోందని, అవినీతి డబ్బుతో ఉపాధ్యాయ ఓట్లు కొనేందుకు సిద్ధమయ్యారన్నారు. టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులు పోటీలో లేకున్నా పోయినా ఉపాధ్యాయుల భవిష్యత్తు కోసం హెచ్చరిస్తున్నారని, వైసీపీ అభ్యర్థులకు ఓటేస్తే, మీ జీవితాలకు మీరే ఉరితాళ్లు బిగించుకున్నట్లేనని ఆయన వ్యాఖ్యానించారు.

TDP govt in Andhra Pradesh to implement scheme to pay monthly allowance of  Rs 1,000 to unemployed youth-Politics News , Firstpost

ఎన్నికలయ్యాక మీ జీతాల్లో కోత పెట్టడంతో పాటు ఇతరత్రా అన్ని సౌకర్యాలు లేకుండా చేస్తారని, రాష్ట్రంలో ప్రైవేటు టీచర్లనూ గౌరవించేలా తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అంతేకాకుండా.. ‘ఎందరో జీవితాలను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు నేడు గౌరవం లేకుండా పోయింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పతనమైపోయింది. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలిగే వ్యవస్థకు శ్రీకారం చుట్టి, పేదరికం లేని కుటుంబ స్థాపనే నా లక్ష్యం. తన సొంత కేసులు వాదించిన న్యాయవాదులకు ప్రభుత్వ కేసులు అప్పగించి వారికి జగన్ ప్రజల సొమ్ము దోచిపెడుతున్నారు. న్యాయ వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి వందల వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. భూ త్యాగాలు చేసిన అమరావతి రైతుల మీద కక్ష తీర్చుకునేందుకు సుప్రీం కోర్టులో నిష్ణాతులైన న్యాయవాదుల్ని తీసుకొచ్చారు. న్యాయం కూడా కొంత ఖర్చుతో కూడుకున్నదైనా న్యాయ వ్యవస్థ వల్లే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలుగుతున్నాం.’ అని చంద్రబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news