గన్నవరం విషయంలో బాబు తప్పు మీద తప్పు..!

-

ఉమ్మడి కృష్ణా జిల్లాలో హాట్ సీట్లలో గుడివాడ,గన్నవరంలు ఉంటాయని చెప్పవచ్చు. ఈ రెండుసీట్లు ఒకప్పుడు టి‌డి‌పి కంచుకోటలే. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది..గుడివాడలో టి‌డి‌పి నుంచి వరుసగా రెండుసార్లు గెలిచి..తన బలాన్ని పెంచుకుని వైసీపీలోకి జంప్ చేసి..వరుసగా రెండుసార్లు గెలిచి..ఇప్పటికి అక్కడ టి‌డి‌పికి ఛాన్స్ లేకుండా కొడాలి సత్తా చాటుతున్నారు. అక్కడ కొడాలికి చెక్ పెట్టడానికి చంద్రబాబు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

గుడివాడ విషయం వదిలేస్తే..గన్నవరం విషయంలో కూడా అదే జరిగింది. రెండుసార్లు వరుసగా టి‌డి‌పి నుంచి గెలిచి..తన బలాన్ని పెంచుకుని..వల్లభనేని వంశీ వైసీపీలోకి జంప్ చేశారు. దీంతో టి‌డి‌పికి నాయకత్వ సమస్య వచ్చింది. వంశీ దెబ్బకు అక్కడ టి‌డి‌పిలో బలమైన నాయకుడు లేరు. దీంతో అదే జిల్లాకు చెందిన బి‌సి నేత బచ్చుల అర్జునుడుని ఇంచార్జ్ గా పెట్టారు. కానీ ఆయన ఎఫెక్టివ్ గా పనిచేయలేదు. పైగా ఇప్పుడు అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్నారు. ఇలాంటి తరుణంలోనే ఇటీవల వైసీపీ శ్రేణులు టి‌డి‌పి ఆఫీసుపై దాడులు చేయడం, టి‌డి‌పి శ్రేణులపై దాడులు చేయడం చేశాయి. చివరికి టి‌డి‌పి నేతలపై కేసులు నమోదు అవ్వడం జైలుకెళ్లడం జరిగింది.

ఇలా టి‌డి‌పి నాయకత్వ సమస్యతో ఇబ్బంది పడుతుంది. ఇదే సమయంలో బాబు..మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణని గన్నవరం కో ఆర్డినేటర్‌గా నియమించారు. కమీటి సభ్యులుగా బచ్చుల సుబ్రహ్మణ్యం, జాస్తి వెంకటేశ్వరరావులను నియమించారు.

అంటే ఇప్పటికీ గన్నవరంలో పోటీ చేసే నేత ఎవరో తేలలేదు. అసలు మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉంటూ కొనకళ్ళ చేసిందేమి లేదు….గన్నవరంలో ఆయన యాక్టివ్ పాలిటిక్స్ చేయడం కష్టమే. పైగా రాజకీయంగా కమ్మ వర్గం హవా ఉన్న గన్నవరంలో మళ్ళీ బి‌సి నేతనే పెట్టడం వల్ల టి‌డి‌పికి ఉపయోగం లేదు. ఒక బలమైన కమ్మ నేతని దింపితేనే గన్నవరంలో టి‌డి‌పి..వంశీతో పోరాడగలదు. ఇలా యాక్టివ్ పాలిటిక్స్ చేయని వాళ్ళని పెట్టుకుని కాలం గడిపితే గన్నవరం సీటుని టి‌డి‌పి కోల్పోవాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news