షాకింగ్ : అమరావతి కోసం రాజీనామా చేయనున్న చంద్రబాబు..?

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆమోదముద్ర వేయడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ విషయమై మాటల యుద్ద నడుస్తుంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అమరావతి లాంటి ప్రాజెక్టును చంపేస్తుంటే ఒక్కోసారి కళ్ల వెంట నీళ్లొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

chandrababu
 

అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ… మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ చంద్రబాబు సహా ఇరవై మంది టీడీపీ ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామా చేయబోతున్నారని తెలిసింది. రేపు గవర్నర్‌ని కలిసి రాజీనామా పత్రాలు అందించనున్నట్లు సమాచారం. కాగా, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల మద్దతు కోసమే చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.