నిజమే! మళ్లీ టీడీపీ సారధి.. మాజీ సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఉంటే.. రాష్ట్రం పరిస్థితి ఇలా ఉండేదా ? ఇటీవల కాలంలో టీడీపీ నేతలు చాలా మంది ప్రజలను రెచ్చగొడుతున్న అంశం ఇదే. ప్రస్తుతం కరోనా రాష్ట్రంలో విజృంభించిన సమయంలో చంద్రబాబుకూడా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. నేనే కనుక అధికారంలో ఉండి ఉంటే.. బాగుండేదని మెజారిటీ ప్రజలు అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అన్నారు. అంతేకాదు, నేనే ఉంటే.. కరోను తరిమి తరిమి కొట్టేవాణ్ని అంటూ.. ఆయన దీర్ఘాలు తీశారు. దీనికి మిగిలిన నాయకులు కూడా వంత పాడారు. చంద్రబాబు అధికారంలో ఉంటే బాగుండేదని చాలా మంది ప్రజలు అనుకుంటున్నారంటూ.. వారు చెబుతున్నారు.
మరి ఈ నేపథ్యంలో బాబు అధికారంలో ఉండి ఉంటే.. రాష్ట్రానికి ప్రయోజనం జరిగి ఉండేదా ? రాష్ట్రం ఉవ్వెత్తున ముందుకు సాగేదా? అనేది మేధావులను కూడా తొలిచేస్తున్న ప్రశ్నలు. దీనికి సమాధానం చూద్దాం. ముందు అమరావతి విషయానికి వద్దాం.. ప్రస్తుతం నిధులు లేక పోవడంతోనే రాజధాని ముందుకు సాగడం లేదని జగన్ సర్కారు చెబుతోంది. కేంద్రం నుంచి నిధులు ఇచ్చే పరిస్థితి లేదని బీజేపీ చెబుతోంది. ఇచ్చేదేదో ఇచ్చేశాం.. అయినా.. కొద్దికొద్దిగా మేం గాంధీనగర్ (గుజరాత్ రాజధాని) డెవలప్ చేసుకున్నాం .. కాబట్టి మీరు కూడా అలానే చేసుకోవాలని చెబుతోంది. అంటే.. దీనిని బట్టి చంద్రబాబు అధికారంలో ఉన్నా.. అమరావతి పరిస్థితి అంతే.
ఇక, అప్పుల విషయానికి వద్దాం. ఎన్నికలకు ముందుగానే చంద్రబాబు సర్కారు అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చేశారు. ఇక, కేంద్రం నుంచి నిధులు మిగిలిన రాష్ట్రాలకు ఎలా ఇస్తున్నారో.. అలానే మనకు కూడా ఇస్తున్నారు. కాబట్టి.. అప్పులు చేయకపోతే.. అధికారంలో ఎవరున్నా.. రోజులు గడిచే పరిస్థితి లేదు. ముచ్చటగా మూడో విషయం.. కరోనా. చంద్రబాబు ఉంటే.. కరోనా ఆగేదా? లేక .. కరోనా రోగులు చనిపోయేవారు కాదా? జగన్ సర్కారు ముందు జాగ్రత్తలు తీసుకున్న మాట వాస్తవం అని కేంద్రమే చెబుతోంది.
అయితే.. అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. దీనికి తోడు.. చంద్రబాబు వంటి మాటకారి జగన్ కాకపోవడమే ఇప్పుడు వచ్చిన చిక్కల్లా.. లేనిది ఉన్నట్టు చూపించడంలో చంద్రబాబు మేధావి కాబట్టి.. అమరావతి అంటే.. అక్కడేదో ఇందప్రస్థం రెడీ అవుతోందనే భావన ఉంది. సో.. ఎటొచ్చీ చెప్పేదేంటంటే.. బాబున్నా.. ఇంతకన్నా ఊడబొడిచేది ఏమీ లేదు..!