నేడు ఏపీలో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు కలిసి మద్దుతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రధమ పౌరులు ఎంపికలో భాగస్వామ్యం కావటం మన అదృష్టమన్నారు. పేద కుటుంబంలో పుట్టిన ఆదివాసీ అయిన ముర్ము ఎంతో కష్టపడి పైకొచ్చారు. సాధారణ పౌరులు అసాధారణ పదవికి ఎన్నిక కావటం మన రాజ్యాంగం విశిష్టత.
సామాజిక న్యాయం కోసం ద్రౌపది ముర్మును బలపరచాలని నిర్ణయించామన్నారు చంద్రబాబు.
అంతేకాకుండా.. కేఆర్ నారయణన్, అబ్దుల్ కలాం, రాంనాధ్ కోవింద్, ముర్ములు రాష్ట్రపతి ఎంపికలో నేను భాగస్వామిని కావటం నా అదృష్టం.. అబ్దుల్ కలాం, రాంనాధ్ కోవింద్, ముర్ము రాష్ట్రపతి ఎంపికలో రాష్ట్రం నుంచి మద్దతు ఏకగ్రీవం కావటం సంతోషాదాయకం.. నరేంద్ర మోడీకి నా అభినందనలు… ద్రౌపది ముర్ము సిన్సియార్టీకి ఎంతో గౌరవం లభిస్తుంది.. ద్రౌపది ముర్ముకు మద్దతు తెలపటం అంతా గర్వించదగ్గ విషయమని వ్యాఖ్యానించారు చంద్రబాబు.