ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అవినీతి వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. రెండు రోజుల్లో రెండు నిర్ణయాలను ముఖ్యమంత్రి జగన్ తీసుకున్నారు. మందుల స్కాం ఒకటి అయితే రెండోది గత ప్రభుత్వ అవినీతి మీద ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ని నియమించడం, వరుసగా ఈ నిర్ణయాలు తీసుకున్న నేపధ్యంలో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గత ప్రభుత్వంలో పని చేసిన మంత్రులతో ఆయన సమావేశం అవుతున్నారు.
మాజీ మంత్రులకు, తనతో సన్నిహితంగా ఉండే కీలక అధికారులకు ఆయన ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎక్కడైనా ఏవైనా అవకతవకలు జరిగాయా అంతా పక్కాగా ఉన్నాయా అనే దాని మీద ఆయన ఆరా తీస్తున్నారు. ఏ క్షణం అయినా ఎవరిని అయినా సరే విచారణకు పిలిచే అధికారం సిట్ కి ఉంది. ఇక ప్రత్యేక పోలీస్ స్టేషన్ ని కూడా కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం.
దీనితో చంద్రబాబు శనివారం ఉదయం నుంచి ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు సమాచారం. అన్ని శాఖల మీద ఆయన ఆరా తీసినట్టు తెలుస్తుంది. అమరావతి భూముల విషయంలో ఏ ఇబ్బంది లేకపోయినా విజయవాడలో కొన్ని భవనాల కేటాయింపు విషయంలో మాత్రం ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. లోకేష్ ని కూడా ఐటి శాఖ తరుపున విచారణకు పిలిచే అవకాశం ఉందని టాక్.
దీనితో ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి చంద్రబాబు న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులతో కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. దొరికితే మాత్రం జగన్ వదిలే అవకాశం లేదు. దీనితో చంద్రబాబు ప్రతీ చిన్న విషయాన్ని ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇటీవల కొన్ని వ్యాఖ్యలతో ఆయన జగన్ ని అవసరంగా రెచ్చగొట్టారు అందుకే ఇదంతా జరుగుతుంది అనే భావనలో టీడీపీ నేతలు కూడా ఉన్నారు.