‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలంటున్న చంద్రబాబు

-

గత మూడున్నరేళ్ల కాలంలో ఇంచార్జ్ పనితీరుపై భేటీల్లో భాగంగా నేటితో 138 నియోజకవర్గ సమీక్షను టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పూర్తి చేశారు. చంద్రబాబు పలు అంశాలపై తన వద్ద ఉన్న ఫీడ్ బ్యాక్ ను వారి కార్యకర్తలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. వైసీపీ జిల్లా అధ్యక్షులను మార్చుకున్న పరిస్థితులపైనా చంద్రబాబు పార్టీ నేతలకు కారణాలు వివరించారు. అధికార పార్టీ బీసీ నేతల రేపటి సమావేశం కూడా వైసీపీలో మొదలైన ఆందోళనకు నిదర్శనం అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ప్రభుత్వంపై నెగటివ్ టాక్ ఎందుకు వస్తుందనే విషయం అధికార పార్టీ నేతలకు కూడా తెలుసని చంద్రబాబు నేతలతో వ్యాఖ్యానించారు. కాగా, నేటితో 138 నియోజకవర్గాల ఇంచార్జ్ లతో చంద్రబాబు ముఖాముఖీ భేటీలు ముగిశాయి.

Leaving BJP fold a mistake, admits Chandrababu Naidu

ప్రజల బాధలపై డిసెంబర్ 2 నుంచి పార్టీ తలపెట్టిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా చేపట్టాలని చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అందరితో సమన్వయం చేసుకుని ఇంచార్జ్ లు ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. తాము నిర్వహించే కార్యక్రమాలపై ప్రతి రోజూ అప్డేట్స్ సోషల్ మీడియా అకౌంట్లలో ఉంచడం ద్వారా ప్రచారం కల్పించాలని కూడా చంద్రబాబు నేతలకు సూచించారు. క్షేత్రస్థాయిలో జరిగే ఈ కార్యక్రమాన్ని రోజువారీ మానిటర్ చేస్తామని తెలిపారు. ‘బాదుడే బాదుడు’ నిర్వహణ మంచి ఫలితాలు ఇచ్చిందని చెప్పిన చంద్రబాబు… ‘ఇదేం ఖర్మ’ మన రాష్ట్రానికి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను అన్నిచోట్లా చర్చకు తీసుకురావాలని అన్నారు. నేతలు పార్టీ కార్యక్రమాల నిర్వహణలో వెనుకబడితే వారే నష్టపోతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news