చంద్రబాబు ఏపీ సీఎం అవుతారు.. కూటమికి 25 ఎంపీలు : పీయూష్ గోయల్

-

చంద్రబాబు మళ్లీ ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతారు.. ఏపీ నుంచి 25 ఎంపీలు మా కూటమికి వస్తారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. ఏపీకి వచ్చిన ఆయన.. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారు.. ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రముఖంగా చర్చించారు.. సీఎం వైఎస్ జగన్పై రాయి దాడి ఘటన సహా ఇతర అంశాలపై కూడా సుదీర్ఘ చర్చ సాగింది.. కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రస్తావన వచ్చిందట.. ఇక, పెన్షన్ల పంపిణీలో వైసీపీ రాజకీయం చేస్తోందని పీయూష్ గోయల్ కి వివరించారు చంద్రబాబు నాయుడు.

మరోవైపు వచ్చే (మే నెల) నెలలో ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలపై కూడా చర్చించారట.. అనంతరం మీడియాతో మాట్లాడిన పీయూష్ గోయల్.. తెలుగు నేలకు నేను రావడం గర్వంగా భావిస్తున్నాను.. గత ఐదేళ్ళుగా ఏపీ చాలా వెనుకబడింది.. రైతులను ఏపీలో పూర్తిగా పట్టించుకోవడం మానేశారని ఆరోపించారు. ఇసుక, ల్యాండ్, లిక్కర్ మాఫియాలకు కేంద్రంగా ఏపీ మారిందని విమర్శించారు పీయూష్ గోయల్. పోలవరం ప్రాజెక్ట్ కి కేంద్రం 15వేల కోట్లు ఇచ్చిందని గుర్తు చేసారు. విశాఖ రైల్వే జోన్ ఇచ్చినా కూడా రాష్ట్రం మాకు భూమిని ఇవ్వలేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version