Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 6.. కొత్త‌గా.. స‌రికొత్త‌గా.. ఆ మార్పులెంటో తెలుసా?

-

Bigg Boss: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు.. బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత అమితంగా ఆక‌ట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకుని విజ‌య‌వంతంగా ఐదవ సీజన్ ను కొన‌సాగిస్తుంది. రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది.
ఈ రియాలిటీ షోలో ఎన్నో ఊహించని సంఘ‌ట‌నలు, మైండ్ బ్యాక్ చేసే ట్విస్టులు, గొడ‌వలు, కొట్లాటాల స‌మ్మిళితం. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా.. టాస్కులు పెట్టి ప్రేక్షకుల మ‌న‌స్సును దోచేయ‌డం బిగ్ బాస్ స్పెష‌ల్.. మాస్ గా చెప్పాలంటే.. పుల్ మిల్స్ ధమ్ కా బిర్యానీలా పుల్ ఎంట‌ర్ టైన్ మెంట్ ను అందిస్తుంది. మ‌రి క్లాస్ గా చెప్పాలంటే.. ఉగాది ప‌చ్చ‌డిలా.. అన్ని రుచుల స‌మ్మేళనం.

బిగ్ బాస్ 5 తెలుగు చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఈ తాజాగా ఓ న్యూస్ వైర‌ల్ అవుతుంది. బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 6 కూడా ప్రారంభించ‌బోతున్నార‌ట‌. ఎవ్వ‌రూ ఊహించ‌ని మార్పుల‌తో కొత్త‌.. స‌రికొత్త‌గా ఈ సీజ‌న్ ప్రారంభించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. రాబోయే ఆరో సీజ‌న్ ను ఓటీటీలో కూడా రాబోతుంద‌ట‌. అందుకు త‌గ్గ‌ట్లుగా 6 వ సీజ‌న్ ను సరికొత్తగా ముస్తాబు చేస్తున్నారట‌. ఇక ఓటీటీ వేదిక‌గా ప్రారంభ‌మ‌య్యే.. ఈ సీజ‌న్ ను కేవ‌లం 54 రోజులు మాత్ర‌మే ఉండేలా చూస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే నిర్వ‌హ‌కులు కంటెస్టెంట్ల వేట‌లో ప‌డ్డార‌ట‌. త్వ‌ర‌లోనే ఆడిష‌న్స్ నిర్వ‌హించ‌న‌న్న‌ట్టు తెలుస్తుంది.

ఇప్ప‌టికే హిందీలో ప్రారంభ‌మైనా.. క‌ర‌ణ్ జోష‌ర్ షోలా ప్లాన్ చేస్తున్నారట‌. ఆ షో కు ఎంత‌టి రెస్పాన్స్ వ‌చ్చిందో అంద‌రికీ తెలుసు.. ఈ షోకు ఇద్ద‌రూ యాంక‌ర్స్ ఉంటార‌ని టాక్ .. అందులో మేల్ , ఫిమేల్ యాంక‌ర్స్ ఉండ‌బోతున్నారట‌. వారిలో హైప‌ర్ ఆది, హాట్ యాంక‌ర్ శ్రీ‌ముఖిల‌ను రంగం దించ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ప్రతివారం ఇద్దరు యాంకర్స్ షోలో సందడి చేస్తారట. ఈ జనవరి కొత్త సంవత్సరం నుండీ ఎంట్రీలు తీస్కుంటారని టాక్ వినిపిస్తోంది.

ఇలా టెలివిజ‌న్, ఓటీటీల్లో ర‌న్ చేయ‌డం వ‌ల్ల షో కి పాపుల‌ర్టీ పెరుగుతుంద‌ని భావిస్తున్నారు నిర్వ‌హ‌కులు. ఇక మరోవైపు టెలివిజన్ లో బిగ్ బాస్ రేటింగ్ పెంచ‌డానికి నిర్వ‌హ‌కులు చాలానే క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్పటికే గ‌త సీజన్స్ తో పోలిస్తే ఐదో సీజన్ లో రేటింగ్ బాగా తగ్గింది. అందుకే, ఈ సారి వేరే యంగ్ హీరోని హోస్ట్ గా పెట్టాలా.. అనే ఆలోచ‌న‌లో బిగ్ బాస్ టీం ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఈ క్ర‌మంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బెస్ట్ అనే అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్టు ఓ టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా ఈసారి బిగ్ బాస్ సీజ‌న్ 6 మరో లెవల్లో ఉండబోతోందని అంటున్నారు బిగ్ బాస్ లవర్స్.

Read more RELATED
Recommended to you

Exit mobile version