‘నా తల్లి బాటలోనే నేను సాగుతా’.. తొలి ప్రసంగంలో కింగ్ ఛార్లెస్ భావోద్వేగం

-

ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్ సామ్రాజ్యాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన మహారాణి ఎలిజబెత్ అస్తమయంతో ఆ దేశంలో విషాదం చోటుచేసుకుంది. ఎలిజబెత్ మరణంతో ఆమె కుమారుడు కింగ్ ఛార్లెస్ 3 బ్రిటన్‌కు నూతన రాజుగా బాధ్యతలు చేపట్టనన్నారు. తన తల్లి జీవితకాలం మొత్తం ఈ దేశం కోసమే సేవ చేశారని, ఆమె వారసత్వాన్ని కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేశారు. రాజు హోదాలో తొలిసారి దేశాన్నుద్దేశించి ప్రసంగించిన ఛార్లెస్‌.. తల్లిని గుర్తుచేసుకుని ఉద్విగ్నభరితులయ్యారు. ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్‌ను ఏలిన సామ్రాజ్ఞి ఎలిజబెత్‌ పరిపూర్ణ జీవితం గడిపారని ఛార్లెస్ అన్నారు. తన తల్లి చిత్రపటాన్ని పక్కనే పెట్టుకుని ఛార్లెస్ తొలి ప్రసంగం చేశారు.

‘‘రాణి ఎలిజబెత్‌ జీవితం చిన్నదైనా, పెద్దదైనా.. అది ఈ దేశానికే అంకితం చేస్తానని 21 ఏళ్ల వయసులోనే రాణి ప్రతిజ్ఞ చేశారు. అది కేవలం ప్రతిజ్ఞ మాత్రమే కాదు.. వ్యక్తిగత నిబద్ధత. ఆమె జీవితంలో అది స్పష్టంగా ప్రతిబింబించింది. రాచరికపు విధుల కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేశారు. ఇప్పుడు ఆమె గొప్ప వారసత్వాన్ని కొనసాగించే బాధ్యత నా భుజాలపై పడింది. ఈ బాధ్యతతో నా జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయని నాకు తెలుసు. అయితే నా తల్లి ప్రతిజ్ఞను కొనసాగిస్తూ నా జీవితం కూడా దేశ సేవకే అని మాటిస్తున్నా. నా ప్రియమైన తల్లికి నేను చెప్పాలనుకునేది ఒకటే.. థ్యాంక్యూ’’ అని కింగ్‌ ఛార్లెస్‌ భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news