BREAKING : యశోద ఆస్పత్రి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిశ్చార్జ్

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాసేపటి క్రితమే యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లారు. సీఎం కేసీఆర్ మరో వారం రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు ప్రకటించడంతో… సీఎం కేసీఆర్ ను డిశ్చార్జ్ చేశారు.

ప్రతి ఏటా ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్ కు పరీక్షలు చేస్తుంటాం..రెండు రోజులుగా బలహీనంగా ఉన్నారాయ‌న అని వైద్యులు చెప్పారు. సాధారణ పరీక్షలు చేశాం.ఎడమ చెయ్యి,ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉంద‌ని చెప్ప‌డంతో ముందు జాగ్రత్తగా మరికొన్ని పరీక్షలు చేస్తున్నామని సీఎం వ్యక్తిగత డాక్టర్ ఎం.వి.రావు తెలిపారు.రొటీన్ పరీక్షల్లో భాగంగానే సీఎం గారికి సీటీ స్కాన్, క‌రొన‌రీ యాంజియోగ్రామ్ చేస్తున్నాం.పరీక్షల ఫలితాలను అనుస‌రించి ఏం చేయాలో చూస్తాం.వారి ఆరోగ్యం నిలకడగా ఉంది.ఇది కేవలం ముందు జాగ్రత్తతో చేస్తున్న పరీక్షలు మాత్రమేనని ఎం.వి.రావు స్ప‌ష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news