మనం ఎవరికైనా ఏదైనా బహుమతిగా ఇస్తున్నాం అంటే అది వారి సొంతం అయినట్లే అవుతుంది. అలా కాకుండా…మీరు ఇచ్చిన బహుమతికి కొన్నేళ్లు అయిన తర్వాత బాగా విలువ పెరిగిందని మళ్లీ మాది మాకు ఇచ్చేమనడం ఎంత వరకూ కరెక్ట్.. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఓ వ్యక్తి ఒక కుటుంబానికి బహుమతిగా ఓ చిలుకను ఇస్తాడు.. మూడేళ్ల తర్వాత మళ్లీ నా చిలుకను నాకు ఇచ్చేమని లొల్లి పెట్టుకున్నాడు.. ఈ గొడవ కాస్తా పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది…ఆ తర్వాత చిలుకే పంచాయితీ తీర్చింది.. ఎలా అంటే..
విదేశీ చిలుక విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఆ వివాదాన్ని చిలుకే పోలీసుల సమక్షంలో పరిష్కరించుకుంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా కమలానగర్‌లో జరిగింది. ఓ వ్యక్తి మూడేళ్ల కిందట విదేశీ చిలుకను మరో కుటుంబానికి బహుమతిగా ఇచ్చాడు. ప్రస్తుతం చిలుక ధర రూ.60 వేలు పలుకుతోందని తెలుసుకున్న ఆ వ్యక్తి.. వేరొకరికి విక్రయించాలని నిర్ణయించుకున్నాడు.. తాను బహుమతిగా ఇచ్చిన చిలుకను తిరిగి ఇవ్వమని డిమాండ్ చేశాడు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. తాము ఇన్ని రోజులూ ఆ చిలుకను ఎంతో ప్రేమగా పెంచుకున్నామని చిలుకను ఇచ్చేదే లేదని ఆ కుటుంబం తేల్చి చెప్పింది.
ఈ వివాదం చివరకు పోలీస్‌స్టేషన్ వరకూ చేరింది. ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన సమస్యను పక్షి ద్వారానే కొలిక్కి తెచ్చారు ఆ పోలీసులు. ఎలా అంటే.. పోలీస్‌స్టేషన్ టేబుల్‌పై చిలుకను ఉంచారు. అనంతరం ఇరు కుటుంబాలను టేబుల్‌కు చెరో వైపు కూర్చొబెట్టారు. పంజరం నుంచి చిలుకను వదిలి పెట్టారు.. అప్పుడు చిలుక.. తనను మూడేళ్లనుంచి పెంచుతున్న ఆ యజమాని దగ్గరకు వెళ్లింది. దీంతో ఆ కుటుంబానికే పోలీసులు చిలుకను అప్పగించారు. ఇక చేసేదేమి లేక ఆ వ్యక్తి వెనుదిరిగాడు..
అయిత సిల్లీ కాకపోతే.. బహుమతిగా ఇచ్చిన దానిపై మళ్లీ ఇంత రాద్దాంత చేయడం.. మీ దగ్గర కూడా ఇలాంటి వెరైటీ మెంటాలిటీ ఉన్నవాళ్లు ఉండే ఉంటారు కదా..!.