ఐస్‌ క్రీమ్‌ తింటే కరోనా బారిన పడ్డట్టేనా ?

Join Our Community
follow manalokam on social media

ఐస్‌ క్రీమ్‌ తింటున్నారా.. కప్‌ ఐస్‌ క్రీమ్‌… కోన్‌… చాకోబార్‌.. అంటూ లాగించేస్తున్నారా..? ఐతే మీరు కరోనా బారిన పడ్డట్టే. ఐస్‌ క్రీమ్‌ కి..కరోనాకి ఏం సంబంధం అనుకుంటున్నారా..? ఐస్‌ క్రీమ్‌ ల్లోకీ ప్రవేశించింది కరోనా మహమ్మారి. కరోనాకి పుట్టినిల్లైన చైనాలో ఐస్‌ క్రీమ్‌ డబ్బాల్లోనూ కరోనా భయటపడింది. ఐస్‌ క్రీమ్‌ తింటే కూడా కరోనా సోకుతుంది అంటున్నారు పరిశోధకులు..

కరోనా కేసులు తగ్గుతున్నాయి… వ్యాక్సిన్‌ కూడా వచ్చేసింది… హమ్మయ్యా అనుకుంటున్నారా..! ఇప్పుడు ఐస్‌ క్రీమ్‌ రూపంలో వెంటాడుతోంది కరోనా మహమ్మారి. ఐస్‌ క్రీమ్‌ డబ్బాల్లోకీ వచ్చి చేరింది కరోనా వైరస్‌. కరోనా పుట్టినిల్లైనా చైనాలో ఐస్‌ క్రీమ్‌ల్లోనూ కరోనాని గుర్తించారు పరిశోధకులు. ఐస్‌ క్రీమ్‌ అంటే చిన్నా , పెద్ద అందరికీ ప్రాణం. అది లేకపోతే ఉండలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఆ ఐస్‌క్రీముల్లో వైరస్ క్రిములు బయటపడడం.. కలకలం రేపుతోంది. దీంతో బయట ఫుడ్స్ తినడానికి.. ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

చైనాలోని టియాంజిన్ మున్సిపాలిటీలో.. డాకియాడో ఫుడ్ కంపెనీకి చెందిన 4,836 ఐస్‌క్రీమ్ డబ్బాలలలో కరోనా వైరస్‌ను గుర్తించారు. వాటిలోని 2,089 బాక్సులను స్టోరేజ్‌లో ఉంచి సీల్ చేశారు. మరో 1,812 బాక్సులను ఇతర ప్రాంతానికి తరలించగా.. మిగతా 935 డబ్బాలు స్థానిక మార్కెట్‌కు తరలించారు. వీటిలో 65 బాక్సులు ఇప్పటికే అమ్ముడయ్యాయి. ఐస్‌క్రీమ్ బాక్సుల్లోకి మనుషుల ద్వారానే కరోనా వైరస్‌ ప్రవేశించిందంటున్నారు యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్ వైద్యులు. ఐస్‌క్రీమ్ అనేది ఫ్యాట్‌తో తయారవుతుందని… దానిని కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వ ఉంచడం వల్ల అక్కడ వైరస్ వేగంగా వృద్ధి చెందుతుంది అంటున్నారు.

ఐస్‌క్రీమ్‌లో కోవిడ్ వైరస్‌ కనిపించడంతో.. పరిశోధకులు అవాక్కయ్యారు. ఇప్పటివరకూ కోవిడ్‌ వైరస్‌… మనుషుల నుంచి జంతువుల నుంచి మాత్రమే కరోనా వ్యాపిస్తుందని తెలియగా… తాజాగా ఆహార పదార్ధాల నుంచి కరోనా వ్యాపిస్తోందని చైనా ఘటన రుజువు చేసింది. దీంతో అప్రమత్తమైన చైనా సర్కార్..ఆ కంపెనీపై చర్యలు తీసుకుంది.. సంస్థను తాత్కాలికంగా మూసివేసిన చైనా అధికారులు.. ఉద్యోగులందరికీ పరీక్షలు నిర్వహించారు.అయితే ఆహార పదార్ధాలతో కరోనా వైరస్ వ్యాపించడం తక్కువేనంటోంది ప్రపంచ ఆరోగ్యసంస్థ. ఇదే విషయాన్ని అంతర్జాతీయ నిపుణులు సైతం చెబుతున్నారు.

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...