బాలయ్య బాబు,చిరంజీవి కలిసి కబుర్లు చెప్పేది సంక్రాంతి కే..!!

-

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న  అన్ స్టాపబుల్ షో అందరి మన్ననలు పొందుతూ , అత్యధిక హిట్స్ తో దూసుకుపోతోంది.ప్రస్తుతం అన్ స్టాపబుల్ మొదటి సీజన్ పూర్తి అయి ,ఆహా లో సీజన్ 2 స్ట్రీమిం గ్ సూపర్ గా ఆకట్టుకుంటుంది. ఈ సీజన్లో మొదటి ఎపిసోడ్ లో  చంద్రబాబు నాయుడు తో కూడా తాను వయస్సు లో వున్నప్పుడు చేసిన కొంటె పనుల గురించి చెప్పించాడు. అలాగే లోకేష్ తో కూడా సరదాగా మాట్లాడించాడు.

ఇప్పడు వచ్చే ఎపిసోడ్స్ లో గెస్ట్స్ ఎవరు రాబోతున్నారు అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. మొదటి సీజన్లో మోహన్ బాబు, మహేశ్ బాబు, అల్లు అర్జున్, నాని, రవితేజ, రాజమౌళి, రానా వంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు. కాని సీనియర్ హీరోలు పాల్గొనలేదు. వారిలో, చిరంజీవి, వెంకటేష్ నాగార్జున వున్నారు. రెండోవ సీజన్ మొదటి ఎపిసోడ్ తర్వాత యంగ్ హీరోలు అడవి శేష్, సిద్ధార్ద్, విశ్వక్ శర్వానంద్ లు వచ్చారు. వారితో ఎపిసోడ్ సరదా సరదా గా గడిచి పోయింది.

ఇక ఇప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు మిగిలిన స్టార్ హీరోలు ఎప్పుడు వస్తారని ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి కొంత సమయం పట్టేలా వుందని తెలుస్తోంది. చిరు, బాలయ్య ఎపిసోడ్ సంక్రాంతి పండుగకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అప్పుడు అయితేనే చిరు వాల్తేరు వీరయ్య కు బాలయ్య వీర సింహ రెడ్డి ప్రమోషన్ లో హైప్ వస్తుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version