టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ‘ఆచార్య’ ప్రమోషన్స్ కోసం ప్లాన్ చేసుకుంటూనే నెక్స్ట్ ఫిల్మ్స్ షూట్ కంప్లీట్ చేస్తు్న్నారు. మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ ఈ నెల 29న ‘ఆచార్య’ పిక్చర్ చూసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక చిరు నటిస్తు్న్న నెక్స్ట్ ఫిల్మ్స్ పైన కూడా ఫ్యాన్స్ బోలెడన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే ఆయా చిత్రాల అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చిరంజీవి చిత్రాల గురించి అప్ డేట్ ఇచ్చేశారు. ‘ఆచార్య’ పిక్చర్ లోని ‘నీలాంబరి, భలే భలే బంజారా’ పాటలను కొరియోగ్రఫీ చేసిన శేఖర్..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాలో అవకాశం మిస్ చేసుకున్నానని చెప్పుకొచ్చారు. ఆ టైంలో తనకు డేట్స్ క్లాష్ అయ్యాయని, త్వరలో పవన్ కల్యాణ్ పాటకు కొరియోగ్రాఫీ అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
‘భలే భలే బంజారా’ సాంగ్ వీడియోలో తండ్రీ తనయులు చిరు-చరణ్ లను చూసి మెగా అభిమానులు సంతోష పడుతున్నారు. చిరంజీవి నెక్స్ట్ ఫిల్మ్ ‘భోళా శంకర్’లో ఓ సాంగ్ షూట్ కంప్లీట్ అయిందని పేర్కొన్ని శేఖర్ మాస్టర్..‘వాల్తేరు వీరయ్య’ పిక్చర్ లోనూ పాటలను కొరియోగ్రఫీ చేయబోతున్నాట్లు తెలిపారు.
‘పవర్, సర్దార్ గబ్బర్ సింగ్ ’ఫేమ్ బాబీ డైరెక్షన్ లో వస్తున్న ‘MEGA 154’ మూవీ టైటిల్ ఇంకా మూవీ యూనిట్ సభ్యులు అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ, శేఖర్ మాస్టార్ మాత్రం ఆ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పెట్టబోతున్నారని ఇన్ డైరెక్ట్ గా చెప్పేశారు. ఈ విషయం తెలుసుకుని మెగా అభిమానులు మాస్ టైటిల్ అదిరిపోయిందని అనుకుంటున్నారు.