‘గాడ్​ఫాదర్’​లో ఆ పాత్రలో పవన్ నటిస్తే బాగుండేది: చిరంజీవి

-

చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్‌ రాజా తెరకెక్కించిన చిత్రం ‘గాడ్‌ ఫాదర్’. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో.. చిత్రంలో కీలక పాత్ర పోషించిన దర్శకుడు పూరీ జగన్నాథ్‌ చిరుతో ‘ఇన్‌స్టాగ్రామ్‌’ వేదికగా ముచ్చటించారు. పూరీ పలు ప్రశ్నలు అడగ్గా చిరు నవ్వుతూ సమాధానమిచ్చారు.

సల్మాన్‌ ఖాన్‌ను తొలిసారి ఎప్పుడు కలిశారు అని చిరంజీవిని పూరీ అడగ్గా… ‘ఓ యాడ్ చిత్రీకరణ సమయంలో బ్యాంకాక్‌లో కలిశా. ఆ యాడ్‌ తెలుగులో నేను చేస్తే, హిందీలో సల్మాన్‌ చేశాడు. అప్పటినుంచి మా మధ్య మంచి అనుబంధం ఉంది. నాకు సోదరుడు. సల్మాన్‌కు రామ్‌ చరణ్‌ అంటే చాలా ఇష్టం. తాను హైదరాబాద్‌ వచ్చినా.. చరణ్‌ ముంబై వెళ్లిన కలుసుకుంటారు. ఈ సినిమాలో నటించినందుకు సల్మాన్‌ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు’అని జవాబిచ్చారు.

‘గాడ్ ఫాదర్ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తే బాగుండేదని చాలామంది అనుకున్నారు నిజమే. సల్మాన్‌ ఖాన్ చేసిన పాత్రలో పవన్‌ నటిస్తే బాగుండేది. ఈ సినిమాలో నటించమని అడిగితే.. కల్యాణ్‌ కాదనేవాడు కాదేమో. ఆ పాత్రను సల్మాన్‌ చేస్తేనే బాగుంటుందని మేము అడగలేదు. ఇతర భాషల్లో కూడా విడుదల చేసే ఆలోచన ఉండటం వల్ల సల్మాన్‌ను తీసుకున్నాం’ అని పూరీ అడిగిన ప్రశ్నకు మెగాస్టార్‌ సమాధానం చెప్పారు.

మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూరీ జగన్నాథ్.. గోవర్ధన్ అనే యూట్యూబర్ పాత్ర చేశారు. యువ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషించారు. నయనతార, సముద్ర ఖని, సల్మాన్​ ఖన్​ కూడా పలు పాత్రలు చేశారు. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల అయిన ‘గాడ్​ ఫాదర్’… బాక్సాఫీస్​ వద్ద ఘన విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version