చియాన్ విక్రమ్ ‘కోబ్రా’గా వచ్చేస్తున్నాడు..రిలీజ్ డేట్ లాక్‌డ్

-

కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. విక్రమ్ నటించిన ప్రతీ సినిమా తెలుగులోనూ విడుదలై చక్కటి ఆదరణ పొందుతుంటోంది. ఇటీవల ‘మహాన్’గా ప్రేక్షకులను OTTఅమెజాన్ ప్రైమ్ లో పలకరించాడు విక్రమ్. ఈ సినిమాతో నటుడిగా తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు విక్రమ్.

ఈ క్రమంలోనే విక్రమ్ నటిస్తున్న ‘కోబ్రా’ ఫిల్మ్..కోసం సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గతంలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. కానీ, కొవిడ్ వలన వాయిదా పడింది. తాజాగా మేకర్స్ మరో రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కోబ్రా’ పిక్చర్ ఈ ఏడాది ఆగస్టు11న విడుదలు చేయనున్నట్లు తెలిపారు. KGF ఫేమ్ శ్రీనిధి శెట్టి ఈ పిక్చర్ లో హీరోయిన్ గా నటించింది. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించగా, స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ ట్రార్డినరీగా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్డూడియోస్ బ్యానర్ పై ఎస్‌.ఎస్‌. ల‌లిత్ కుమార్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ప్రముఖ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ ఇందులో విలన్ గా నటించడం విశేషమని చెప్పొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news