మెగా అభిమానులకు డబుల్ ట్రీట్..‘ఆచార్య’తో రికార్డులు బద్ధలే..

-

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మెగా అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో తన నటనతో రామ్ చరణ్ మెగా అభిమానులకు ట్రీట్ ఇచ్చేశాడు. ఇంకో నెల గ్యాప్ తో అనగా వచ్చే నెల 29న విడుదలయ్యే ‘ఆచార్య’ చిత్రంతో అభిమానులను మరోసారి సర్ ప్రైజ్ చేయనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశారు.

తండ్రీ తనయులు చిరంజీవి, రామ్ చరణ్ ల కలయికను సిల్వర్ స్క్రీన్ పైన చూసి సినీ ప్రేక్షకులు, మెగా అభిమానులు ఆనందపడనున్నారు. టీజర్ లో కొద్ది సెకన్ల పాటు చిరు, చెర్రీలను ఒకే ఫ్రేంలో చూసిన అభిమానులు.. ఇక థియేటర్ లో కొద్ది నిమిషాల పాటు అలానే చూసి ఉండిపోతారని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘ధర్మస్థలి’ అనే ప్రాంతంలో అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే నక్సలైట్ పాత్రలో చిరంజీవి కనిపించనున్నట్లు తెలుస్తోంది. పూజారిగా ఉన్న రామ్ చరణ్.. చిరంజీవి పాత్ర ద్వారా ఇన్ స్పైర్ అయి ఆయన కూడా నక్సల్ గా మారిపోతాడనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కి్ల్స్ లో వినబడుతోంది.

చిరు, చెర్రీలు ‘ఖైదీ నెం.150’ చిత్రంలో ఓ పాటకు కలిసి స్టెప్పులేశారు. కాగా, ‘ఆచార్య’లో మాత్రం కలిసి నటించారు. అలా వారున్నంత సేపు సినీ ప్రియులను ఆనందపరుస్తారని వినికిడి. ఇకపోతే ఈ చిత్రంలో రొమాంటిక్ కామెడీ సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయట. చిరంజీవి- కాజల్ అగర్వాల్ , రామ్ చరణ్ – పూజా హెగ్డేల హెల్దీ రొమాంటిక్ సీన్స్ స్పెషల్ ట్రీట్ గా ఉండబోతాయని అంటున్నారు.

పల్లెటూరు అమ్మాయి పాత్రలో పూజా హెగ్డే నటించగా, కాజల్ అగర్వాల్ మోడ్రన్ లుక్ ప్లస్ సంప్రదాయ లుక్ రెండిటినీ కలిగి ఉంటుందని సమచారం. ఈ చిత్రంలో ఓ పాటలో చిరు, చెర్రీలు కలిసి వేసిన స్టెప్పులు చూస్తే ప్రేక్షకుల మతి పోవాల్సిందేనట. యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రెజీనా కసాండ్ర ‘ఆచార్య’ ఫిల్మ్ లో స్పెషల్ సాంగ్ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version