న్యాయస్థానాలే ప్రజల చెంతకు చేరాలి : సీజేఐ డీవై చంద్రచూడ్‌

-

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైవిధ్యమైన భారత దేశంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సవాల్‌.. అందరికీ న్యాయం అందుబాటులోకి తీసుకురావడమే అని సీజేఐ డీవై చంద్రచూడ్‌ అన్నారు. మరోవైపు, దేశాన్ని ఉన్నత శిఖరాలను తీసుకెళ్లాలంటే ప్రాథమిక విధులే మన మొదటి ప్రాధాన్యం కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. “ప్రజలు న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కాలని ఆశించడం కాదు.. న్యాయస్థానాలే ప్రజల చెంతకు చేరాలి” అన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్‌. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టులో శనివారం జరిగిన వేడుకల్లో ఆయన ప్రసంగించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ న్యాయవ్యవస్థలు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు సీజేఐ డీవై చంద్రచూడ్‌.

Justice Chandrachud will take over as CJI on November 9 | Latest News India  - Hindustan Times

“మనలాంటి వైవిధ్యభరితమైన దేశంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సవాల్‌.. అందరికీ న్యాయం అందుబాటులోకి తీసుకురావడమే. అయితే దీనికోసం మన న్యాయవ్యవస్థ చర్యలు చేపడుతోంది. సుప్రీంకోర్టు దిల్లీలోని తిలక్‌ మార్గ్‌లో ఉన్నప్పటికీ అది దేశ ప్రజలందరిదీ. సర్వోన్నత న్యాయస్థానంలో వర్చువల్ పద్ధతిని తీసుకొచ్చాం. దేశంలో ఎక్కడినుంచైనా లాయర్లు తమ కేసులను వాదించే వెసులుబాటు కల్పించాం. సాంకేతికత సాయంతో కోర్టు పనితీరును మెరుగుపరుస్తున్నాం” అని వెల్లడించారు సీజేఐ డీవై చంద్రచూడ్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news