బుద్దా సంచలనం..విజయవాడ టీడీపీలో చిచ్చు..!

-

విజయవాడ తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు తారస్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటినుంచో పార్టీలో రచ్చ జరుగుతుంది. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎంపీ కేశినేని నానికి ఏ మాత్రం పడని విషయం తెలిసిందే. ఇప్పటికే వీరు బహిరంగంగా విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇదే సమయంలో కేశినేని తమ్ముడు శివనాథ్(చిన్ని) విజయవాడ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని తిరుగుతున్నారు..విజయవాడ పరిధిలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

ఇదే సమయంలో కేశినేనికి చెక్ పెట్టడానికి బుద్దా వర్గం చిన్నికి సపోర్ట్ చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ప్రత్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని,  అసెంబ్లీలో చంద్రబాబు వెనుక కూర్చుని ఆయన్ని అవమానించిన వారి అంతు చూస్తామన్నారు. తాను, నాగుల్ మీరా ఇద్దరం ఈసారి చట్ట సభల్లో అడుగుపెడతామని తెలిపారు. పార్టీలో ఏ పదవి లేకుండానే కేశినేని చిన్ని ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, చిన్నీకి పదవి ఉంటే పేదలకు మరింత లాభమన్నారు.

విజయవాడ పశ్చిమలో ఈ సారి పోటీచేసి గెలిచేది తెలుగుదేశమే అని నాగుల్ మీరా ధీమా వ్యక్తం చేశారు. అయితే పశ్చిమ నియోజకవర్గానికి ఇంచార్జ్ గా కేశినేని నాని ఉన్న విషయం తెలిసిందే. అక్కడ కేశినేనికి చెక్ పెట్టడానికి బుద్ధా వర్గం ప్రయత్నిస్తుంది. వచ్చే ఎన్నికల్లో వెస్ట్ సీటు కేశినేని కుమార్తెకు ఇస్తారనే ప్రచారం ఉంది. ఇటు బుద్దా లేదా నాగుల్ మీరా వెస్ట్ లో పోటీ చేయాలని చూస్తున్నారు.

కానీ పొత్తు ఉంటే ఆ సీటుని జనసేనకు ఇవ్వాలని చంద్రబాబు చూస్తున్నారు. జనసేనకు ఇస్తే ఏ గోల ఉండదని భావిస్తున్నారు. చూడాలి మరి చివరికి బుద్దా ఏ సీటులో పోటీ చేస్తారో.

Read more RELATED
Recommended to you

Exit mobile version